రవితేజ నటించిన రావణాసుర సినిమా ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

మరి ఆ సినిమా ఎలా ఉంది? రవితేజ ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను రీచ్ అయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు ఈ రివ్యూలో తెలుసుకోండి.

కథ: రవీంద్ర(రవితేజ) అనే ఒక క్రిమినల్‌ లాయర్‌. వెంకటలక్ష్మి(ఫరియా అబ్దుల్లా) అనే సీనియర్‌ దగ్గర జూనియర్‌ గా చేస్తుంటాడు.

ఎలాగోలా ఒకర్ని పడేసి వెంటనే పెళ్లి చేసుకోవాలి అనుకునే వ్యక్తి ఈ రవీంద్ర.

మరోవైపు నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. పెద్ద పెద్ద వాళ్లు చనిపోతుంటారు.

అయితే ఆ హత్యలుఎవరు చేస్తున్నారు? రవితేజ వాటి వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యాడు? అనే విషయాలు తెలియాలంటే మీరు సినిమాకి వెళ్లాల్సిందే.

విశ్లేషణ: ఇది ఒక సర్వ సాధారణ రివేంజ్‌ స్టోరీనే.. కానీ దీనిని తెరకెక్కించిన తీరు మీకు బాగా నచ్చుంది.

సుధీర్ వర్మ కథలో ఎన్నో ట్విస్టులు, షాకులు ప్లాన్ చేసుకున్నాడు.

రవితేజ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ చూశాక ఇంకా ఊపు తగ్గలేదు అనే డైలాగు తప్పకుండా అంటారు.

సుశాంత్ కు ఈ మూవీలో మంచి సపోర్టింగ్ రోల్ దొరికింది. ప్రతి సన్నివేశంలో సుశాంత్ ప్రేక్షకులను మెప్పించాడు.

 టెక్నీషియన్స్: స్క్రీన్ మీద కనిపించే హీరో రవితేజ అయితే.. ఆఫ్‌ ది స్క్రీన్ హీరో మాత్రం సుధీర్ వర్మనే చెప్పాలి. 

ఈ మూవీలో హర్షవర్దన్, భీమ్స్‌ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా నచ్చుతుంది.

బలాలు: రవితేజ, కథనం, ట్విస్టులు, నటీనటులు

బలహీనతలు: అక్కడక్కడా నెమ్మదిగా సాగే సీన్ల

చివరి మాట: ఈ రావణాసురుడు మీకూ నచ్చుతాడు.

రేటింగ్: 3/5