2008 ఆగస్టు 18న అంతర్జాతీయ  క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ నేటితో  14 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

టీ20ల్లో అత్యధికంగా 7 సార్లు ప్లేయర్‌  ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు గెలుచుకుని  కోహ్లీ టాప్‌లో ఉన్నాడు.

టీ20ల్లో అత్యధిక పరుగుల చేసిన  ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మూడో  స్థానంలో ఉన్నాడు.

 టీ20ల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన  జాబితాలో కోహ్లీ 30 అర్థసెంచరీలతో రెండో  స్థానంలో ఉన్నాడు.

వన్డేల్లో 9 ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు పొందిన  కోహ్లీ.. ఈ అవార్డును ఎక్కువసార్లు సాధించిన  మూడో ఆటగాడిగా ఉన్నాడు.

వన్డేల్లో అత్యధిక బ్యాటింగ్‌ యావరేజ్‌ కలిగి  ఆటగాళ్ల జాబితలో 57.68 సగటుతో కోహ్లీ 4వ  స్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో 50.12 బ్యాటింగ్‌ యావరేజ్‌తో రెండో  స్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో వేగంగా 2500 పరుగులు పూర్తి  చేసుకున్న రెండో ఆటగాడు కోహ్లీనే.

వన్డేల్లో వేగంగా 12000 పరుగులు చేసిన  క్రికెటర్‌గా కోహ్లీ టాప్‌లో ఉన్నాడు.

వన్డేల్లో ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసి  చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. 

కోహ్లీ ఇప్పటి వరకు 102 టెస్టులు, 262 వన్డేలు,  99 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

టెస్టుల్లో 8074, వన్డేల్లో 12344, టీ20ల్లో 3308  పరుగులు సాధించాడు.

కోహ్లీకి టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సెంచరీలు  ఉన్నాయి. 

అలాగే టెస్టుల్లో 28, వన్డేల్లో 64, టీ20ల్లో 30 హాఫ్‌  సెంచరీలు సాధించాడు.