దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా ఫస్ట్ టైమ్ నటించిన ఓటిటి సిరీస్ 'రానా నాయుడు'. హాలీవుడ్ 'రే డొనోవన్' సిరీస్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది.

తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైన ఈ సిరీస్.. ఫ్యామిలీతో చూడాల్సిన సిరీస్ కాదు.

మరి మొదటిసారి వెంకీ - రానా కలిసి నటించిన 'రానా నాయుడు' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!

(కథ) రానా నాయుడు(రానా), నాగా నాయుడు(వెంకటేష్) తండ్రీకొడుకులు. బాలీవుడ్ సినీ సెలబ్రిటీలకు ఫిక్సర్ గా వర్క్ చేస్తుంటాడు రానా నాయుడు.

నాగా నాయుడు 15 ఏళ్ళు జైలు జీవితం గడిపి బయటికి వస్తాడు. అప్పటినుండి తండ్రీకొడుకులిద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి.

రానా, నాగా నాయుడుల మధ్య గొడవ ఏంటి? నాగా నాయుడు 15 ఏళ్ళు జైలు శిక్ష ఎందుకు అనుభవించాడు? చివరికి ఏమైంది? అనేది సిరీస్ లో చూడాలి.

(విశ్లేషణ) ఈ సిరీస్ ఎలా ఉందో చెప్పేముందు ఓ మాట. ఇది ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సిరీస్ కాదు. పుష్కలంగా బీప్ డైలాగ్స్, అడల్ట్ కంటెంట్ ఉంటాయని గ్రహించాలి.

కథ.. మెయిన్ గా రానా నాయుడు, నాగా నాయుడు క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ని టచ్ చేస్తూ.. క్రైమ్, యాక్షన్, మాఫియా, డ్రగ్స్ అంశాలను చూపించారు.

అసలు కథలోకి తీసుకెళ్లడానికి చాలా సమయం తీసుకున్నారు మేకర్స్. రెండు మూడు ఎపిసోడ్స్ తర్వాత అసలు కథ స్లోగా మొదలైంది.

రానా, నాగా నాయుడు ఫ్యామిలీ విషయాలు ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి. వారిద్దరూ ఎదురు పడినప్పుడు వచ్చే సన్నివేశాలు ఓకే అనిపిస్తూనే.. వారి క్యారెక్టర్స్ వెనుక ఎమోషనల్ టచ్ ని గుర్తుచేస్తుంటాయి.

హాలీవుడ్ సిరీస్ లు చూసే వాళ్లకు రానా నాయుడు థ్రిల్లింగ్ గా అనిపించకపోవచ్చు. పైగా బీప్ డైలాగ్స్ ఉండేసరికి.. తెలుగు వాళ్ళు జీర్ణించుకోవడానికి టైమ్ పడుతుంది.

మొదట్లో కలిగిన సందేహాలకు క్లైమాక్స్ లో కి ట్విస్టులు, వాటి తాలూకు ఎమోషన్స్ జోడించి రివీల్ చేశారు. ఎండింగ్ లో ఓ సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు.

(ప్లస్ లు) వెంకటేష్ – రానా స్క్రీన్ ప్లే యాక్షన్ సీన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

(మైనస్ లు) బీప్ డైలాగ్స్ డ్రామా స్లో స్టార్ట్

(చివరిమాట)  రానా నాయుడు..  18 ప్లస్ వాళ్లకు మాత్రమే! రేటింగ్: 2.5