చూడముచ్చటైన స్టార్‌ కపుల్స్‌లో అజిత్‌, షాలినిల జంట ఒకటి.

ఈ జంట సినిమా కారణంగా కలుసుకుని, ప్రేమించి పెళ్లి చేసుకుంది.

వీరిద్దరూ 1999లో ‘అమర కలమ్‌’ సినిమా చేస్తూ ఉన్నారు.

ఆ సమయంలో అజిత్‌ కారణంగా షాలిని మణికట్టుకు గాయం అయ్యింది.

తన కారణంగా గాయం అవ్వటంతో అజిత్‌ బాధపడ్డాడు. ఆమె గాయం తగ్గే వరకు తరచుగా ఫోన్‌ చేసి విచారిస్తూ ఉన్నాడు.

దీంతో ఇద్దరి మధ్యా స్నేహం ఏ‍ర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారింది.

వీరి ఎఫైర్‌ విషయం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయింది. దీంతో దర్శకుడు, నటుడు రమేష్‌ ఖన్నా అజిత్‌కు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

‘నీ గురించి, షాలిని గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకోవద్దు. ఆమెకు దూరంగా ఉండు’ అని అన్నారు.

అయితే, వీరి ప్రేమ గురించి తెలియక రమేష్‌ ఈ వార్నింగ్‌ ఇచ్చారు.

అయితే, వీరి ప్రేమ గురించి తెలియక రమేష్‌ ఈ వార్నింగ్‌ ఇచ్చారు.

ప్రేమ విషయం తెలియగానే రమేష్‌ సంతోషం వ్యక్తం చేశారు.

రమేష్‌ ఖన్నా అజిత్‌ పెళ్లికి వెళ్లటమే కాదు.. ఆ జంటను ఆశీర్వదించారు.