నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం మొదలైంది.

ముస్లింలు రంజాన్ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.

ఈ మాసంలో ఉపవాసం దీక్షను చేస్తే.. తమ ప్రార్ధనలు  అల్లా స్వీకరిస్తాడని నమ్మకం.

ఉపవాస సమయంలో అందరూ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

అటువంటి పరిస్థితిలో సెహ్రీ, ఇఫ్తార్ల సమయంలో పోషకాహారాన్ని చేర్చుకోవాడం మంచిది

రంజాన్‌ మాసంలో సేమియా ఖీర్ తీసుకుంటే అది మీకు శక్తిని అందిస్తుంది.

సేమియాను స‌హ‌జంగానే భిన్న ర‌కాల పిండిల మిశ్రమంతో త‌యారు చేస్తారు.

ఇందులోని కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు  సులభ జీర్ణమ‌వుతాయి.

సేమియా ఖీర్ తింటే మ‌న శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతం పెరుగుతాయి.

సాధారణ వ్యక్తులకు ఏమి కాదు కానీ.. షుగర్ ఉన్న వారు వీటిని తీసుకోరాదు.

రోజూ శారీర‌క శ్రమ‌, వ్యాయామం ఎక్కువ‌గా చేసేవారు శక్తి కోసం సేమ్యాను తిన‌వ‌చ్చు

అనారోగ్య స‌మ‌స్యలు ఉన్నవారు సేమియా ఖీర్ దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు.

సేమియా ఖీర్ లో డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి , కుంకుమపువ్వు ను  జోడించండి.

 రంజాన్ మాసంలో సెహ్రీ లేదా ఇఫ్తార్ సమయంలో వేడి వేడి ఖీర్ వడ్డించవచ్చు.

సేమియా ఖీర్ లో ఉపయోగించే డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

మీరు కూడా రంజాన్‌ మాసంలో ఈ సేమియా ఖీర్ తప్పకుండా ప్రయత్నించండి