ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉందని, ఈ హీరోయిన్ నా లవరని.. యాక్చువల్ గా ఆ సినిమాలో హీరో నేనే.. కానీ కుట్ర చేసి నన్ను గెంటేశారు, తోసేశారు అని చెప్పుకు తిరిగే సునిశిత్ గురించి అందరికీ తెలిసిందే.

హీరోలు, హీరోయిన్ల పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూడడమే కాకుండా వారిపై నీచంగా కామెంట్స్ చేస్తుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటాడు.

ఇప్పటి వరకూ ఏ సినిమాలో నటించకపోయినా, ఒక్క సినిమాలోనూ హీరోగా చేయకపోయినా హీరో అని చెప్పుకు తిరుగుతుంటాడు.  

ఇతని మీద ఎన్ని ట్రోల్స్, మీమ్స్ వచ్చినా ఇతను మాత్రం తన పంథాను మార్చుకోలేదు.

లావణ్య త్రిపాఠి విషయంలో పోలీస్ కేసు అయినా సరే మనిషి మారలేదు.

ఇంకా హీరోయిన్స్ మీద, ఇతర సెలబ్రిటీల మీద కామెంట్స్ చేస్తున్నాడు.

తాజాగా రామ్ చరణ్ కుటుంబం జోలికి వచ్చాడు.

మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఇరగ్గొట్టేశారు.   

కొన్ని రోజుల క్రితం సునిశిత్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసనపై కామెంట్స్ చేశాడు.

అసలే అభిమానులు హీరోల భార్యలను వదినగా భావిస్తారు. తల్లి తర్వాత తల్లిగా ఫీలవుతారు.

అలాంటిది రామ్ చరణ్ సతీమణి ఉపాసన మీద కామెంట్స్ చేస్తే ఊరుకుంటారా?

సునిశిత్ ఇంటికెళ్లి మరీ చితక్కొట్టారు. ఈ దెబ్బలతో సునిశిత్ చేసిన తప్పు తెలుసుకున్నాడు.

భారీగా రామ్ చరణ్ అభిమానులు సునిశిత్ ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పించారు.

తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు బాధపడుతున్నా అని వెల్లడించాడు.

ఇంకోసారి మరే హీరో మీద గానీ, హీరోయిన్ల మీద గానీ కామెంట్స్ చేయను. 

వారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను. నన్ను క్షమించండి అంటూ వేడుకున్నాడు.