అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు.
నా దారి రహదారి.. అడ్డురాకండి!
నా జన్మ విరోధిని అయినా క్షమిస్తాను.. కానీ నా వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే వారిని క్షమించను.
మీసం వచ్చిన వాడల్లా మగాడు కాదు.. తల్లిదండ్రులు ఎంత ఆస్తి పరులైనాఅందులో చిల్లిగవ్వ ఆశించకుండా కష్టపడి తిండి పెట్టేవాడే మగాడు.
కష్టపడనిదే ఏదీ రాదు.. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు.
చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం,
చట్టం నిదానంగా శిక్షించి దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం.
ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి.
ప్రేమించేటప్పుడు కన్నవాళ్ళని మర్చిపోతారు,
ప్రేమించాక మిమ్మల్ని మర్చిపోతారు,
పెళ్ళైన తర్వాత ప్రేమను మర్చిపోకండి.
పిల్లలు కన్నవాళ్ళని మర్చిపోవచ్చు
కానీ పిల్లల్ని కన్నవాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు.
జన్మనిచ్చిన తల్లికోసం కష్టపడటంలో న్యాయం ఉంది.
భార్యాబిడ్డలు మామామరిది అనే బంధాల్లో కాలటం కంటే
బండెడు కట్టెల్లో కాలటం ఎంతో మంచిది.
నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయి,
సింహం సింగిల్ గా వస్తుంది!
పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు
పోయేటప్పుడు తీసుకుపోయేది లేదు..
ఇక దేనికి నీది- నాది అనే స్వార్థం!
ఇచ్చిన మాట, చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు!
మోసం చేసిన వాడికన్నా, మోసపోయినవాడే నేరస్థుడు!
క్యారే.. సెట్టింగా! వీరయ్య బిడ్డనురా దిల్ ఉంటే గుంపుగా రండ్రా!