ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ వేసవి తాపానికి గురవుతూ ఉంటారు. అలాంటివారు చలువ పదార్థాల వైపు మొగ్గుచూపుతారు.

నిద్రలేమి, డిప్రేషన్ తో బాధపడేవారికి రాగి జావ మంచి ఔషదంలా పనిచేస్తుంది

రాగి జావలో ఎలుసినియాన్ అనే ప్రొటీన్ ఉంటుంది.. ఇది పోషకాహార లోపాన్ని నివారిస్తుంది.

రాగి జావలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది.. దీని వల్ల అధిక బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

ఇందులో మెథియోనిన్, లైసిన్ వంటి ఆమ్లాలు ఉన్నాయి.. ఇది మీ చర్మరక్షణకు ఉపయోగపడతాయి

రాగుల్లో కెరాటిన్ అనే ప్రోటీన్లు జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది. 

రాగి జావ ఉదయం పూట తీసుకోవడం వల్ల  మీ శరీరంలో బ్లడ్ లో షుగర్ స్థాయిని తగ్గిస్తుంది.  ఇన్సులిన్‌గా మారుస్తుంది. 

రాగుల్లో అధికంగా   కాల్షియం ఉంటుంది.. ఇది మీ శరీరంలోని ఎముకలను ధృడంగా ఉంచుతుంది.

రాగుల్లో ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్‌లు సమృద్దిగా ఉంటాయి.. ఇది క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

రాగి జావ ప్రతిరోజు తాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవొచ్చు. 

రాగుల్లో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.. శరీరంలోని  కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. 

హై బ్లడ్ ప్రెజర్ తో ఇబ్బంది పడేవారు..  ఫైబర్ ఫుష్కలంగా ఉండే రాగి జావ తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది.

వేసవి కాలంలో  వడదెబ్బ నుండి రక్షణ పొందేందుకు రాగిజావ  ఎక్కువగా తాగుతారు.