చికిత్స కంటే నివారణ ఉత్తమం అని అంటారు. రాబోయే రోగాలను నియంత్రించేందుకు ప్రకృతి ఒడిలో దొరికే సహజ వనరులు చాలు. ఆ సహజ వనరుల్లో ముల్లంగి ఒకటి.

ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి రోగాలను నివారించవచ్చు.

  ముల్లంగిలో యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్స్ అధికంగా ఉంటాయి.

  ఇవి క్యాన్సర్ ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

  ముల్లంగిని నీటిలో కలపడం వల్ల ఐసోథియోసైనేట్ ల సమ్మేళనాలు రిలీజ్ అవుతాయి. ఇది క్యాన్సర్ కణతుల పెరుగుదలను నివారిస్తాయి.

  ముల్లంగిలో ఉండే ఔషధ గుణాలు డయాబెటీస్ ని నియంత్రిస్తాయి

  ఇందులో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు.. డీపోనెక్టిన్ అనే హార్మోన్ ని నియంత్రిస్తాయి.

  ఈ కారణంగా ఒంట్లో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అందుకే మధుమేహులు ముల్లంగి తినాలని సూచిస్తారు.

  ముల్లంగిలో ఉండే పొటాషియం రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది. గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది.

  ముల్లంగిలో ఉండే ఆంథోసైనిన్ రక్తప్రసరణ, రక్తపోటును మెరుగుపరుస్తాయి.

  ముల్లంగిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

  ముల్లంగిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

  ముల్లంగి తినడం వల్ల మలబద్ధకం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి.