ఓ ప్రాంతీయ సినిమాను దేశం మొత్తం నెత్తిన పెట్టుకోవటం చాలా అరుదుగా జరుగుతుంటుంది.

అలాంటి అరుదైన ఘనతను సొంత చేసుకున్న అతి కొద్ది సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. ఈ సినిమా కేవలం మౌత్‌ పబ్లిసిటీతో సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

అల్లు అర్జున్‌ నటన, సుకుమార్‌ దర్శకత్వం, రష్మిక మందన్నా అందం, పాటలు, మాటలు, ఇలా అన్నీ కలిసి సినిమాను ఓ లెవల్‌కు తీసుకెళ్లాయి.

ఈ సినిమా దేశ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక, ఈ సినిమా అవార్డుల పరంగా కూడా తన ఉనికిని చాటుకుంది.

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌

ఉత్తమ దర్శకుడిగా సుకుమార్‌

ఉత్తమ సంగీత దర్శకుడిగా  దేవీశ్రీ ప్రసాద్‌

ఉత్తమ పాటల రచయితగా  చంద్రబోస్‌

ఉత్తమ సహాయ నటుడిగా  జగదీష్‌

ఉత్తమ చిత్రంగా పుష్ప అవార్డులను సొంతం చేసుకున్నారు.

పుష్ప సినిమా సాధించిన విజయంతో ‘‘పుష్ప 2’’ కథలో సుకుమార్‌ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

మొదటి భాగాన్ని మించి రెండో భాగం ఉండేలా జాగ్రత్తపడుతున్నారట. ఈ మేరకు స్టార్‌ హీరోలు, హీరోయిన్లను రంగంలోకి దించబోతున్నారంట.

ఈ సినిమా షూటింగ్‌ తాజాగా ప్రారంభమైంది. 2023లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మరి, పుష్ప సినిమా సైమా అవార్డ్స్‌ 2022లో ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.