కన్నడ సినీ పరిశ్రమ గురించి చెప్పుకోవాల్సి

వస్తే ముందుగా పునీత్ రాజ్ కుమార్ గురించి 

ఎక్కువగా చెప్పుకోవాలి. అతను ఇండస్ట్రీలో 

అడుగుపెట్టనంత వరకు కన్నడ పరిశ్రమకి 

మాస్ అప్పీల్ పెద్దగా ఉండేది కాదు.

కానీ తన యాక్టింగ్ తో పాటు డాన్స్ లు, ఫైట్

 లతో అక్కడి బాక్సాఫీస్ లెక్కల్ని పూర్తిగా

మార్చేశాడు పునీత్ రాజ్ కుమార్. తెలుగులో 

 హిట్ అయిన కొన్ని సినిమాలు పునీత్ హీరోగా

 రూపొందాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి 

తెలుగు To కన్నడ :

అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి

కన్నడలో ‘మౌర్య’ పేరుతో రీమేక్ 

అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.

రెడీ

కన్నడలో ‘రామ్’ పేరుతో రీమేక్ అయ్యి

విజయవంతమైంది మన రెడీ చిత్రం.

ఒక్కడు

కన్నడలో ‘అజయ్’ పేరుతో రీమేక్ అయ్యి

సూపర్ హిట్ అయ్యింది ఈ చిత్రం.

దూకుడు

కన్నడలో ‘పవర్’ పేరుతో రీమేక్ అయ్యి

ఘనవిజయం సాధించింది ఈ చిత్రం.

కన్నడ TO తెలుగు :

అప్పు

కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా

నటించిన ఈ చిత్రం తెలుగులో రవితేజ

హీరోగా ‘ఇడియట్’ పేరుతో రీమేక్ అయ్యింది.

వీర కన్నడిగ

ఈ చిత్రం బైలింగ్యువల్ మూవీగా 

తెరకెక్కింది. తెలుగులో పూరి జగన్నాథ్… 

కన్నడలో మెహర్ రమేష్ తెరకెక్కించారు. 

తెలుగు కంటే కూడా ఓ రోజు ముందుగా 

కన్నడలో రిలీజ్ అయ్యింది. అలాగే అక్కడ 

సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో 

ప్లాప్ అయ్యింది.