కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంతో కన్నడ చిత్ర సీమ మాత్రమే కాదు, యావత్ సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురయ్యంది. ఇక అభిమానులు అయితే ఇప్పటికీ ఆ శ్రోక సంద్రంలో నుండి బయటకి రాలేకపోతున్నారు. 

నిజానికి పునీత్ పాన్ ఇండియా సినిమాలు అంతగా తీయలేదు. ఆయనవి చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఇతర భాషల్లోకి డబ్ అయ్యాయి. కానీ.., స్టార్స్ నుండి సామాన్యులు వరకు భాషతో సంబంధం లేకుండా పునీత్ కోసం బాధపడటానికి ప్రత్యేక కారణం ఉంది.

పునీత్ రాజ్ కుమార్ అందరితో బాగా ఉండేవారు. చిన్న హీరో అయినా, సూపర్ స్టార్ అయినా, సామాన్య అభిమానిని అయినా అంతే ఆప్యాయంగా పలకరించే వారు.

ఈ నేపథ్యంలోనే పునీత్ కి అన్నీ భాషల్లో మిత్రులు, శ్రేయాభిలాషులు ఏర్పడ్డారు. కోలీవుడ్ లో కూడా రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, విశాల్ వంటి టాప్ స్టార్స్ తో పునీత్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. 

కానీ.., మన తెలుగు హీరోలు తప్పించి, తమిళ స్టార్ హీరోలు ఎవ్వరూ కూడా పునీత్ రాజ్ కుమార్ చివరి చూపుకి హాజరు కాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పునీత్ రాజ్ కుమార్ కి కోలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. కానీ.., కోలీవుడ్ స్టార్ హీరోలు పునీత్ అంత్యక్రియలకి హాజరు కాకపోవడం వెనుక ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తోంది. 

కావేరీ నది జలాల సమస్య కారణంగానే కోలీవుడ్ స్టార్స్ కన్నడ పవర్ స్టార్ అంత్యక్రియలకు హాజరు కాలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

నిజానికి కావేరీ నది జలాల సమస్య ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం నడుస్తూనే ఉంది. 

ప్రభుత్వాలు మారినా, ముఖ్య మంత్రులు మారుతున్నా ఈ జల వివాదంకి మాత్రం ఒక సొల్యూషన్ రావడం లేదు. 

జలాల పంపిణీలో తమిళనాడుకి వాటా ఇవ్వాలని సుప్రీం అప్పట్లో తీర్పు కూడా ఇచ్చింది. అయితే.. ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ కన్నడ హీరోలు రోడ్డుపైకి వచ్చారు.

కర్ణాటకలో తమిళ సినిమాలను, టీవీ ప్రసారాలను అడ్డుకున్నారు. ఇదే సమయంలో కర్ణాటకలో ఉంటున్న తమిళులపై దాడులు కూడా జరిగాయి. 

ఈ పరిణామాలు అన్నిటిని తప్పు పడుతూ అప్పట్లో తమిళ స్టార్స్ కూడా రోడ్లపైకి వచ్చారు.

 అప్పట్లో జరిగిన ఈ గొడవ కారణంగానే తమిళ స్టార్ హీరోలు పునీత్ అంత్యక్రియలకు హాజరు కాలేదన్న టాక్ వినిపిస్తోంది. మరి.  ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.