కన్నడిగులు ప్రత్యక్ష దైవంలా ఆరాధించే రాజ్‌కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్. పునీత్ 1975 మార్చ్ 17న కర్ణాటకలో జన్మించాడు.
మొదటి కుమారుడు శివరాజ్ కుమార్ కూడా కన్నడ చలన చిత్ర సీమలో సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు.
రెండో కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ మొదట్లో హీరోగా అనేక సినిమాల్లో నటించారు. రాఘవేంద్ర రాజ్‌కుమార్ కి కూడా అప్పట్లో గుండెపోటు రావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఇప్పుడు ఒక చెయ్యి పనిచేయదు.
మూడో కుమారుడు పునీత్ రాజ్‌కుమార్ మాత్రం ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు.
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన “అప్పు” పునీత్ రాజ్ కుమార్ మొదటి చిత్రం. 2002 లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. పునీత్ ని ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది.
పునీత్ రాజ్ కుమార్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు వరకు కన్నడలో ఊర మాస్ హీరోలు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన వచ్చాకే డ్యాన్స్ లు, ఫైట్స్ లో కుమ్మేసి కన్నడ సినీ ఇండస్ట్రీని ఒక రేంజ్ కి తీసుకెళ్లారు.
కన్నడలో ఏ హీరోకి లేని ఘనత పునీత్ రాజ్ కుమార్ కి ఉంది. ఈ జనరేషన్ లోనే ఆయన పేరిట నాలుగు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అప్పు, నట సార్వభౌమ, మైత్రి, పవర్ ( మన దూకుడు రీమేక్)
తెలుగు నటులు అన్నా, తెలుగు టెక్నీషియన్స్ అన్నా పునీత్ రాజ్ కుమార్ చాలా గౌరవం ఇస్తారు. జూనియర్ యన్టీఆర్ ని ఆయన సొంత తమ్ముడిలా భావించేవారు. ఇందుకే తన సినిమాలో యన్టీఆర్ చేత ఒక పాట కూడా పాడించుకున్నారు.
కెరీర్ అంతా మాస్ సినిమాలే చేసినా పునీత్ రాజ్ కుమార్ ని అవార్డ్స్ వెతుక్కుంటూ వచ్చాయి. ఆయన పేరు మీద చాలానే ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఉన్నాయి.
1985లో ‘బెట్టాడు హూవి’చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెల్చుకున్న స్థాయి పునీత్ రాజ్ కుమార్ ది.
ఇక పునీత్ రాజ్ కుమార్ కుటుంబ విషయానికి వస్తే ఆయన భార్య పేరు అశ్విని రేవంత్. పునీత్ కి వందిత రాజ్ కుమార్, ద్రితి రాజ్ కుమార్ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
అభిమానులు అంటే పునీత్ రాజ్ కుమార్ కి విపరీతమైన ఇష్టం. నా అభిమానులు ఎప్పుడూ కాలర్ ఎగరేసుకొని తిరగాలి అన్నది ఆయన కోరిక. అందుకే ప్రతి సినిమా కోసం పునీత్ అంతలా కష్టపడుతుంటారు.
పునీత్ రాజ్ కుమార్ చివరిసారిగా నటించిన చిత్రం యువరత్న. కోవిడ్ సమయంలో కేవలం ఈ సినిమా కోసమే కన్నడ ప్రభుత్వం ఓ పది రోజులు థియేటర్స్ తెరిచింది అంటే.. పునీత్ రాజ్ కుమార్ స్థాయి ఏమిటనేది అర్ధం చేసుకోవచ్చు.
పునీత్ రాజ్ కుమార్ మరణంపై ఒక్క కన్నడ ఇండస్ట్రీ సెలబ్రెటీలు మాత్రమే కాకుండా.. అన్నీ రాష్ట్రాల సినీ జనం తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అతి తక్కువ వయసులోనే అసాధ్యమైన రికార్డ్స్ క్రియేట్ చేసిన పునీత్ రాజ్ కుమార్.. ఇలా 46 ఏళ్ళ వయసులోనే తిరిగిరాణి లోకాలకి వెళ్లిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. మీరు కూడా.
పునీత్ ఆత్మకి శాంతి చేకూరాలని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.