ఆస్పత్రులకు వెళ్లాలంటేనే భయపడే రోజులివి. పలు హాస్పిటల్స్ లో చిన్న రోగానికి కూడా టెస్టులు, స్కానింగ్ ల పేరుతో వేలకు వేలు లాగేస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల లేమి, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజుల భయంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ఇలాంటి తరుణంలో ఓ డాక్టర్ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.

తన ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే పైసా కూడా తీసుకోవడం లేదో డాక్టర్.

ఆ వైద్యుడి పేరే గణేశ్ రాఖ్. గైనకాలజిస్ట్ అయిన గణేశ్​కు ఆడపిల్లలు అంటే ప్రాణం. వారిని లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారాయన. 

అందుకే తన ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే పేషెంట్ల నుంచి ఒక్క పైసా తీసుకోరు. 

ఓపీ మొదలుకొని అన్ని సదుపాయాలను రోగులకు ఖర్చు లేకుండా సమకూర్చుతున్నారు గణేష్ రాఖ్. 

గణేష్ తన క్లినిక్ మొదలుపెట్టి ఇప్పటికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్లలో 2,470 మందికి ఆయన ఉచిత కాన్పులు చేశారు.  

ఆడపిల్ల పుడితే ఉచిత చికిత్స అని గణేష్ రాఖ్ ఆస్పత్రి మొదలుపెట్టిన కొత్తలో ప్రకటించారు.

దీంతో ఆయన్ను అందరూ ‘మ్యాడ్ డాక్టర్’ అని పిలిచారు. 

కానీ రోగులకు గణేష్ అందిస్తున్న సేవలు చూసి విమర్శించిన నోళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నాయి.

గణేశ్​ రాఖ్​ను స్ఫూర్తిగా తీసుకుని కొంతమంది వైద్యులు ఆయన బాటలో నడిచేందుకు ముందుకొస్తున్నారు. 

గణేశ్​ రాఖ్ గురించి తెలిసిన చాలా మంది ప్రజలు.. ఇలాంటి డాక్టర్లు తమ ఊర్లలోనూ ఉంటే బాగుండని అనుకుంటన్నారు. 

ఆడపిల్ల పుడితే నయా పైసా కూడా తీసుకోకుండా చికిత్స చేస్తున్న గణేశ్​ రాఖ్​ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.