‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ప్రియాంక మహా అయితే ఒక 3 వారాలు ఉంటుంది అనుకున్నారు.
కానీ, ఆ మూడు కాస్తా పదమూడు వారాలు అయ్యాయి.
బిగ్ బాస్ నుంచి ప్రియాంకకు ఎంత పారితోషకం అందింది అనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రియాంక సింగ్ కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.
అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రియాంక ఇప్పుడు లక్షాధికారి అయ్యింది.
ఒక్కో వారానికి రూ.1.7 లక్షల దాకా అందినట్లు తెలుస్తోంది.
అంటే 13 వారాలకు ప్రియాకంకు దాదాపు రూ.23 లక్షల వరకు అందుంటాయి.
ప్రియాంకకు బిగ్ బాస్ తో ఫ్యాన్ బేస్ కూడా చాలా పెరిగింది.
బిగ్ బాస్ ద్వారా ప్రియాంక సింగ్ చిరకాల కోరిక కూడా తీరే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
గతంలో ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని ప్రియాంక ప్రయత్నించింది.
కానీ, అందుకు బ్యాంక్ బ్యాలెన్స్ కావాలని కోరడంతో ఆ ప్రయత్నాన్ని ఆపేసింది.
బిగ్ బాస్ ద్వారా అందిన రెమ్యూనరేషన్ తో పింకీ తన కల నెరవేర్చుకుంటుందనే అందరూ భావిస్తున్నారు.