జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ 'అనుదీప్'.. తమిళ హీరో శివకార్తికేయన్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'ప్రిన్స్'

అక్టోబరు 21న ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఎలా ఉదో రివ్యూలో తెలుసుకుందాం.

కథ: ఆనంద్(శివకార్తికేయన్) ఓ స్కూల్ టీచర్. కానీ సరిగా ఉద్యోగం చేయడు. బ్రిటీష్ భామ జెస్సిక(మరియా) రాకతో డైలీ స్కూల్ కి వెళ్తాడు.

కొన్ని సీన్స్ తర్వాత హీరోహీరోయిన్స్ ప్రేమలో పడతారు. తండ్రి నుంచి పెళ్లి విషయంలో గ్రీన్ సిగ్నల్ వస్తుందనుకుంటాడు.

కానీ సీన్ రివర్స్ అవుతుంది. జెస్సికతో పెళ్లికి ఆనంద్ తండ్రి విశ్వనాథం(సత్యరాజ్) ఒప్పుకోరు.

దీనికి తోడు ఊరి వాళ్ల నుంచి కూడా తన  ప్రేమకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఆనంద్ అందరినీ ఎలా కన్విన్స్ చేశాడు?

తన ప్రేమకథని ఎలా హ్యాపీ ఎండింగ్ చేశాడనేది తెలియాలంటే థియేటర్ కి వెళ్లి మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ: 'ప్రిన్స్' తీసింది అనుదీప్ కాబట్టి.. 'జాతిరత్నాలు' మూవీతో పోల్చి చూడటం చాలా కామన్. కానీ రెండు వేర్వేరు.

'జాతిరత్నాలు' ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్ టైనర్ గా తీస్తే... 'ప్రిన్స్'లో మాత్రం మెసేజ్ కూడా ఉండేసరికి కామెడీ కాస్త తక్కువైంది.

స్టార్టింగ్, ఎండింగ్ సీన్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. మధ్యలో సన్నివేశాలు సరిగా పేలలేదు. 

యాక్టింగ్ విషయానికొస్తే.. తన అలవాటైన తరహా పాత్ర అయ్యేసరికి శివకార్తికేయన్ చేసుకుంటూ వెళ్లిపోయాడు.

హీరోయిన్ మరియా నవ్వు బాగుంది. సత్యరాజ్, ప్రేమ్ జీ తదితరులు పరిధి మేరకు నటించారు.

తమన్ సంగీతం బాగుంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ కూడా బ్యూటిఫుల్ గా ఉంది.

అనుదీప్ కూడా లాజిక్ లేని కామెడీ సీన్స్ తో బాగానే ఎంటర్ టైన్ చేశాడు. కానీ 'జాతిరత్నాలు'లా మ్యాజిక్ చేయలేకపోయాడు.

రేటింగ్: 2.5