ప్రస్తుతం చలికాలం నడుస్తోంది. అదీ కాక రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతూనే ఉంది.

దాంతో ఉదయాన్నే నిద్ర లేవాలి అంటే చాలా బద్దకంగా అనిపిస్తుంది. 

చాలా లేట్ గా గగనంగా లేస్తాం.

ఇక ఈ చలికాలంలో మరో పెద్ద సమస్య స్నానం చేయడం. 

మీర ముఖ్యంగా చన్నీటితో స్నానం చేసే అలవాటు ఉన్నవారికి పెద్ద గండమనే చెప్పాలి.

చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తే పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు 

ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూస్తాం.

ఈ కాలంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల పక్షవాతం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు వైద్యులు.

అందుకే మరీ చన్నీరు కాకుండా కాస్తా వేడిగా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు.

ఈ చలి సీజన్ లో చన్నీటితో స్నానం చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బాడీపై చన్నీరు పడటంతో శరీరం మై కాడ్రియల్ ఇన్ ఫ్రాక్షన్ బారిన పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక చలికాలంలో స్నానానికి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నోట్: పైన తెలిపిన టిప్స్ పాటించే ముందు నిపుణుల, వైద్యుల సలహాలు తీసుకోండి.