గ్యాస్ సిలిండర్ వల్ల ప్రమాదం జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

గ్యాస్ సిలిండర్ ని ఎప్పుడూ వంటగదిలో నిటారుగా మాత్రమే నిలబెట్టి ఉంచాలి. ఏటవాలుగా లేదా పడుకోబెట్టి ఉంచడం వంటివి చేయకూడదు.

స్టవ్ వెలిగించేందుకు గ్యాస్ లైటర్ ను మాత్రమే వాడాలి. 

అగ్గిపుల్లలు, ఇతర లైటర్లను వాడకపోతేనే మంచిది.

వంటగదికి వెంటిలేషన్ ఉండడం ముఖ్యం. గ్యాస్ సిలిండర్ దగ్గర కిటికీ ఉండేలా చూసుకుంటే గ్యాస్ లీక్ అయినప్పుడు ప్రమాదం జరగకుండా ఉంటుంది.

వీలైతే సిలిండర్ ని వంటగది బయట చిన్న సందు ఉంటే ఆ సందులో పెట్టుకోవడం చాలా మంచిది.  

ఇలా చేయడం వల్ల గ్యాస్ లీకైనా గాల్లో కలిసిపోతుంది. అస్సలు ప్రమాదం ఉండదు.

వంటగదిలో లైటర్ తప్ప ఇంక వేరే మండే వస్తువులు గ్యాస్ సిలిండర్ దగ్గర గానీ స్టవ్ దగ్గర గానీ ఉండకూడదు.

కుదిరితే వంట చేసేటప్పుడు ఏప్రాన్ ధరించండి.

ఇక కుకింగ్ సమయంలో వంట గిన్నెలను గ్రిప్పర్ లేదా హోల్డర్ సహాయంతో మాత్రమే పట్టుకోవాలి. బట్టతో పట్టుకోవడం వల్ల అంటుకునే ప్రమాదం ఉంది.

సిలిండర్ సమీపంలో సిగరెట్ తాగడం లాంటివి చేయకూడదు.

తరచూ బర్నర్, గ్యాస్ పైప్ ని చెక్ చేస్తూ ఉండాలి. ఏ మాత్రం లీకేజీ కనిపించినా వెంటనే మరమ్మత్తు చేయించాలి.

ఇంట్లో గ్యాస్ లీక్ అవుతున్న వాసన వస్తే.. వెంటనే ఎలక్ట్రికల్ స్విచ్చులు ఆఫ్ చేసి, కిటికీలు, తలుపులు తెరవాలి.