ఇటీవల కాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 13 డిగ్రీలకు పడిపోయి క్రమ క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది.

చలికాలంలో చలి తీవ్రతతో పాటు మరిన్ని ముప్పులు సంభవిస్తాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. 

ముఖ్యంగా గుండె సమస్యలున్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇతర కాలాలతో పాలిస్తే ఈ కాలంలో అనేక రకాలైన వ్యాదులు దరి చేరే అవకాశం ఉంటుందని డాక్టర్స్ సూచిస్తున్నారు. 

ఎక్కువ సమయం చలిలో గడిపితే కనుక గుండెలోని రక్త నాళలు చలించుకుపోతాయని, దీని కారణంగా గుండె సంబంధమైన వ్యాదులు రావొచ్చిన వైద్యులు తెలియజేస్తున్నారు.

ఈ కాలంలో గనుక గుండె సంబంధమైన వ్యాదులు వస్తే చాలా ప్రమాదమంటూ వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అయితే ఇలాంటి వ్యాదులు దరి చేరకుండా ఉండాలంటే కనీస జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాది నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చలికాలంలో త్వరగా ఇన్ ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది.

ప్రధానంగా తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. వెడిగా ఉన్న ఆహారం, నీటిని మాత్రమే తీసుకోవాలి. 

గుండె సమస్యలున్న వారు వాకింగ్, వ్యాయమం చేసేటప్పుడు ఎండ వచ్చాక చేయట ఉత్తమం.

 వాతావరణం చల్లగా ఉంది కదా అని విచ్చలవిడిగా మద్యం, సిగరెట్లు తాగటం ప్రమాదకరం. 

ప్రధానంగా డి విటమిన్ కోసం శరీరానికి తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. 

ఈ కాలంలో శరీరానికి తగినంత నిద్ర, ఆహారం ఉండేలా చూసుకుని ఉన్ని దుస్తువులు ధరించాలి. 

గుండె సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

ఇలాంటి జాగ్రత్తలు గనుక పాటిస్తే గుండె సమస్యల నుంచి బయట పడవచ్చిన వైద్యులు సూచిస్తున్నారు.