"రాధేశ్యామ్"..  టీజర్ ఇప్పుడు 

రికార్డ్స్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

అయితే.. ఈ టీజర్ ని కాస్త క్షుణ్ణంగా గమనిస్తే

దిమ్మ తిరిగి విషయాలు తెలుస్తున్నాయి.

రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్

 క్యారెక్టర్ సాధారణ మనిషి కాదు!

మరో గ్రహం నుండి భూమి మీదకి వచ్చిన

గ్రహాంతర వాసి అన్న షాకింగ్ న్యూస్ ఇప్పుడు 

అందరిని ఉలిక్కి పడేలా చేస్తోంది. 

 "నేను దేవుడిని కాదు. 

అలాగని మీలో ఒకడిని కూడా కాదు"..

టీజర్ లోని ఈ లాస్ట్ డైలాగ్ జాగ్రత్తగా

గమనించారా? విక్రమ్ ఆదిత్యకి ఈ భూమిపై 

మనుషుల ఫ్యూచర్ ముందే ఎలా తెలిసిపోతుంది?

దాని పేరే "డిఫరెంట్ టైమ్ లైన్స్ థియరీ". 

ఈ "డిఫరెంట్ టైమ్ లైన్స్ థియరీ"

అనేది మన తెలుగు ప్రేక్షకులకి కాస్త కొత్త.

మార్వెల్ మూవీస్ చూసే వారికి అయితే.. ఈ

కాన్సెప్ట్  గురించి పెద్దగా పరిచయం 

అవసరం లేదు.

మన లెజండరీ డైరెక్టర్

సింగీతం శ్రీనివాస్ కూడా "ఆదిత్య 369"

మూవీ లో డిఫరెంట్ టైమ్ లైన్స్  గురించి 

ప్రస్తావించారు.

రాధేశ్యామ్ లో ప్రభాస్

క్యారెక్టర్ కూడా ఇలాంటిదే. వేరే గ్రహం

మీద నుండి  భూ గ్రహం మీదకి వచ్చిన 

విక్రమ్ ఆదిత్యకి మన ఫ్యూచర్ అంతా పాస్ట్

అనమాట. విక్రమ్ ఆదిత్య ఇందుకే అందరి

జాతకాలను చెప్పగలడు. కానీ.., ఆ జరిగే రాతని 

మాత్రం మార్చలేడు. 

ఈ క్రమంలో విక్రమ్ ఆదిత్యకి

ఇటలీలో ఓ అమ్మాయి నచ్చుతుంది. 

ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడతాడు. కానీ..,

ఆమె చుట్టూ సమస్యలు. వాటి వల్ల  ఆమె మరణం

తప్పదు! అదే రాత! 

విక్రమ్ ఆదిత్య తన

ప్రియురాలి కోసం జరగబోయే దాన్ని

మార్చాలి అనుకుంటాడు. ఇందుకోసం

అతను ఎవరిని ఎదిరిస్తాడు? తన ప్రేమ కోసం

ఎలాంటి కష్టాలు పడతాడు? చివరికి తన ప్రియరాలిని 

కాపాడుకున్నాడా? లేదా? అన్నదే రాధేశ్యామ్ 

స్టోరీగా తెలుస్తోంది. 

రాధేశ్యామ్ టీజర్ లో

ప్రభాస్ వాయిస్ మాములుగా లేదు.

మార్వెల్ మూవీస్ లో థోర్ వాయిస్ లా 

డిఫరెంట్  బేస్ వస్తోంది. ఈ రిఫరెన్స్ అక్కడ

నుండి తీసుకుందే అన్న టాక్ వినిపిస్తోంది. 

టీజర్ లో ప్రభాస్ ఉంటున్న

ఇంటి ఫ్లోర్, రూఫ్ అంతా మ్యాప్స్ తో 

కవర్ చేసి ఉన్నారు. ఇంకోసారి జాగ్రత్తగా 

ఇవన్నీ ఖగోళ శాస్త్రాన్ని ఇండికేట్ చేసేవే. 

రాధేశ్యామ్ కి హాలీవుడ్ లో

కాన్ స్టన్ టైన్ కూడా ఒక రెఫెరెన్స్ 

కావచ్చు అన్న టాక్ ఉంది. 

కాన్ స్టన్ టైన్ సినిమా

దేవుడు, దెయ్యానికి మధ్య జరిగే 

ఆధిపత్య పోరు. మానవలోకంపై పైచేయి 

 సాధించాలని సైతాన్స్ ప్రయత్నిస్తూ ఉంటాయి. 

కానీ.., హీరో మాత్రం దేవ దూతలా భూమిపై 

ఉండి వాటిని ఎదుర్కుంటూ ఉంటాడు. 

వాసికి, దేవుడి రాతకి మధ్య కాంఫ్లిక్ట్ లా 

ఇదే రైవల్టీని ఓ గ్రహాంతర

ఇరికిస్తే..? అది కూడా హీరోయిన్ ప్రేమ కోసం

అయితే..? ఎలా ఉంటుంది అన్నదే రాధేశ్యామ్

కథ అని తెలుస్తోంది.