ప్రస్తుతం ఎన్టీఆర్ జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్గా చేస్తున్నాడు. ఎన్టీఆర్ మాటల తూటాలు బుల్లితెర ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ షో ఒక వారానికి మించి మరొక వారం టీఆర్పీలను పెంచుకుంటూ పోతోంది.

ఇక ఈ షోలో మొదటి గెస్ట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ అలాగే దర్శక ధీరుడు రాజమౌళి వచ్చారు.

ఇక ఇప్పుడు సూపర్ స్టార్  మహేష్ బాబు సైతం తారక్ కోసం మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్నికి వచ్చారు. ఆ ఎపిసోడ్ కి సంబంధించి షూట్ కూడా కంప్లీట్ అయ్యింది.

అయితే తాజాగా అందుతున్న సమాచరం ప్రకారం మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ గా రానున్నాడట.ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు మేనేజ్మేంట్ ప్రభాస్ తో చర్చలు జరిపారని.. ప్రభాస్ టైం కూడా ఫైనల్ చేసారని టాక్. ఇదే కనుక నిజమైతే ఇద్దరు బడా హీరోలు ఒక్కే స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులకు పెద్ద పండగనే చెప్పాలి.