తెలుగు సినిమా కీర్తి ఈరోజు 

 అది మన బాహుబలి  రెబల్ స్టార్ 

ఖండాంతరాలు దాటి..పాన్ ఇండియా, 

 పాన్ వరల్డ్ రేంజ్ కి చేరుకుంది అంటే

ప్రభాస్ కష్టమే. 

ఒక ప్రాంతీయ హీరోగా మొదలు 

 పెట్టి ఆ తర్వాత నేషనల్ హీరో స్థాయికి

ఎదిగిన ప్రభాస్ బయోగ్రఫీ గురించి 

ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, 

ప్రభాస్.. 1979 అక్టోబర్ 23న  

శివకుమారి దంపతులకు పశ్చిమగోదావరి

జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు.

 ప్రభాస్ కు అన్నయ్య ప్రభోద్, చెల్లెలు

ప్రగతి ఉన్నారు.

 ప్రభాస్ కి సినిమారంగ ప్రవేశం ..

పెదనాన్న.. కృష్ణంరాజు గారి ద్వారా 

జరిగింది. అప్పట్లో కృష్ణంరాజు కు ఉన్న

రెబల్ స్టార్  బిరుదు ఈ జనరేషన్ లో

 ప్రభాస్ కు వచ్చింది.

2002 నవంబర్ 11న రిలీజ్ అయిన 

ఈశ్వర్ మూవీతో ప్రభాస్ హీరోగా ఎంట్రీ 

ఇచ్చాడు. అశోక్ కుమార్ నిర్మాతగా 

జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో ఈశ్వర్

చిత్రం తెరకెక్కింది. 

2003లో విడుదలైన రాఘవేంద్ర 

ఎమ్మెస్ రాజు నిర్మాతగా శోభన్ డైరెక్షన్ 

 సినిమా ఫ్లాప్  అయినా.., తర్వాత 

లో విడుదలైన వర్షం సూపర్ హిట్ అయ్యింది.

 ఈ సినిమా కారణంగానే ప్రభాస్ హీరోగా

సెటిల్ అయ్యాడు. 

2005 సెప్టెంబర్ 30 తేదీన 

 విడుదలైన ఛత్రపతి మూవీ ప్రభాస్

కెరీర్ గ్రాఫ్ ని అమాంతం మార్చేసింది.

బి.వి.ఎస్ నిర్మాతగా,  రాజమౌళి దర్శకత్వంలో

తెరకెక్కిన  ఛత్రపతి బాక్సాఫీస్ వద్ద  రికార్డుల

మోత మోగించింది. 12 కోట్ల 50 లక్షలతో 

నిర్మించిన ఈ సినిమా 30 కోట్ల షేర్ వసూలు

చేయడం విశేషం. 

2006  నుండి 2010 వరకు ప్రభాస్ 

అంతగా కలసి రాలేదు అని చెప్పుకోవచ్చు. 

ఈ నాలుగేళ్ల కాలంలో విడుదలైన  పౌర్ణమి, 

యోగి, మున్నా,బుజ్జిగాడు,బిల్లా,ఏక్ నిరంజన్ 

వంటి సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు

అందుకోలేకపోయాయి.

2010  ఏప్రిల్ 10న విడుదలైన 

డార్లింగ్ ప్రభాస్ కి చాలా కాలం తరువాత

హిట్ మూవీగా నిలిచింది. ఆ తరువాత 

2011లో మిస్టర్ పెర్ఫెక్ట్ అప్పటి వరకు 

ప్రభాస్ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. 

 2013 ఫిబ్రవరి 8 ని ప్రభాస్ 

ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. ఆ రోజే

క్లాస్ లుక్ లో కనిపిస్తూ వచ్చిన ప్రభాస్

మిర్చి మూవీ విడుదలైంది. అప్పటి వరకు

లోని మాస్ యాంగిల్ ని బయటకి తీసింది ఈ 

మూవీనే. దర్శకుడిగా కొరటాల శివ మొదటి

చిత్రం ఇదే కావడం విశేషం. 

2013 లో మిర్చి సక్సెస్ తరువాత 

 ప్రభాస్ ఇండస్ట్రీ తలరాతని మార్చేసే

నిర్ణయం తీసుకున్నారు. అదే బాహుబలికి

గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడం. మరో సినిమాకి కమిట్

కమిట్ అవ్వకుండా బాహుబలి కోసం

బల్క్ గా డేట్స్ ఇచ్చేశాడు ప్రభాస్. 

సుమారు మూడేళ్ళ గ్యాప్ తరువాత

"బాహుబలి ది బిగినింగ్" ప్రేక్షకుల 

ముందుకి వచ్చింది. సుమారు రూ.180 కోట్ల 

తెరకెక్కిన ఈ చిత్రం ఓవరాల్ రన్ లో రూ.650

 కోట్ల వసూల్ చేసి అందరిని. ఆశ్చర్యపరించింది.

 ఇదే.. గొప్ప అనుకుంటే బాహుబలి-2 ఊహలకి

 సైతం అందని రికార్డ్స్ నెలకొల్పింది.

2017 ఏప్రిల్ 18న విడుదలైన

"బాహుబలి-2" ప్రపంచ వ్యాప్తంగా 

తెలుగోడి సత్తా చాటింది. రూ.250 కోట్ల బడ్జెట్ 

తో తెరకెక్కిన  "బాహుబలి కంక్లూజన్" సుమారు 

రూ.2000 కోట్ల  కలెక్ట్ చేయడం విశేషం. ఈ దెబ్బతో

దెబ్బతో ఇండియన్ సినీ హీరోలు అంతా

ప్రభాస్ కి సాహో అనేశారు.

2019లో ఎన్నో అంచనాల 

నడుమ పాన్ ఇండియా మూవీగా 

విడుదలైన సాహో ఆశించిన మేర  ప్రేక్షకులను

ఆకట్టుకోలేకపోయింది. కానీ.ప్రభాస్ క్రేజ్ కారణంగా

 ఆ మూవీ కూడా  వరల్డ్ వైడ్ గా రూ.430 కోట్లని 

కలెక్ట్ చేయడం విశేషం.

ఇప్పుడు ప్రభాస్ తో సినిమాలు

చేయడానికి అంతా పోటీ పడుతున్నారు. ..,

కానీ.., మన బాహుబలి మాత్రం తన స్థాయికి  

తగ్గ ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ

ముందుకి పోతున్నాడు. 

ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్

త్వరలోనే విడుదల కానుండగా, తరువాత..

సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే, స్పిరిట్ 

మూవీలు క్యూలో ఉన్నాయి. 

చూశారు కదా? ఇది ప్రభాస్ . 

బయోగ్రఫీ. తెలుగు సినిమా తలరాతని

మార్చేసిన మన బాహుబలి స్టార్ కి సుమన్ టీవీ

తరుపు నుండి మరోసారి హృదయపూర్వక

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.