శరీరం దృఢంగా ఉండాలంటే ఎముకలు బలంగా, పుష్టిగా ఉండాలి.

ఎముకలు బలంగా లేకపోతే ఏ చిన్న దెబ్బ తగిలినా విరిగిపోతాయి. కట్టుకట్టినా త్వరగా అతుక్కోవు. అతుక్కున్నా మునుపటిలా బలంగా ఉండవు.

ఎముకలు బలంగా ఉంటేనే రోజువారీ పనులు చేయగలం. లేదంటే కష్టమైపోతుంది.

మరి ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం.

పాలు, గుడ్లు, బాదంపప్పు, రాగులు, నువ్వులు, కిడ్నీ బీన్స్ లేదా రాజ్ మా, సోయా బీన్స్, బ్రోకలీ, నారింజ పండ్లు, పొద్దుతిరుగుడు గింజలు, మునగాకు, మెంతి కూర, క్యాబేజీ, బెండకాయ, చిలగడదుంప, పచ్చని ఆకుకూరలు వంటి వాటిల్లో కాల్షియం ఉంటుంది.

అయితే ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు గసగసాల్లో కూడా ఉన్నాయి.

గసగసాల్లో కాల్షియంతో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, జింక్, కాపర్, విటమిన్ ఇ, సెలీనియం వంటి పోషకాలు ఉన్నాయి.

గసగసాలు రోజువారీ ఆహారంలో వివిధ మార్గాల్లో తినవచ్చు.

గసగసాల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఆహారంలో గసగసాలను తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.  

గసగసాల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి.

గసగసాల్లో ఉండే థియోనిన్ అనే అమైనో ఆమ్లం రాత్రుళ్ళు నిద్ర బాగా పట్టడానికి సహాయపడుతుంది.

పాలలో గసగసాలు కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది. అలానే ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

గసగసాల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి.  

గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా సేకరించబడింది. దీని మీద అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.