దేశంలో రైతన్నల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది.
ఖర్చులు పెరగటంతో వ్యవసాయం భారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో మోదీ సర్కార్ రైతులను ఆదుకునేందుకు పీఎం కిసాన్ పేరిట ఆర్థిక సాయం అందిస్తోంది.
మూడు విడతులగా ఏడాదికి రూ.6వేలు చెల్లిస్తోంది.
ఇదే క్రమంలో మరో అడుగు ముందుకేసి వారికి సబ్సిడీపై ట్రాక్టర్లను సైతం అందిస్తోంది. అయితే దేశంలో చాలా మంది అన్నదాతలకు ఈ స్కీమ్ గురించి తెలియదు. వారి కోసమే ఈ కథనం..
వ్యవసాయంలో ట్రాక్టర్ కీలక పాత్ర పోషిస్తుంది. పొలం దున్నడం మొదలుపెట్టి.. పంట ఇంటికి చేరే వరకు అడుగడుగునాట్రాక్టర్ అవసరం ఉంటుంది.
కానీ, చాలా మంది రైతులకు సొంతంగా ట్రాక్టర్ ఉండదు. అందుకు కారణం.. ఆర్థిక స్థోమత.
ఎంతలేదన్నా ట్రాక్టర్ కొనాలంటే కనీసం 6 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఇంత మొత్తం పెట్టలేని వారు కొనడానికి వెనకడుగు వేస్తుంటారు.
లాంటి వారిని దృష్టిలో ఉంచుకొని సబ్సిడీలో సగం ధరకే ట్రాక్టర్ ని అందిస్తోంది.
ఎవరైనా రైతులు పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పథకం కింద ట్రాక్టర్ ను కొనుగోలు చేస్తే సబ్సిడీ వస్తుంది.
అందుకోసం రైతులు ముందుగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైతే సబ్సిడీ డబ్బులు రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తుంది.
ఈ పథకానికి ఆఫ్ లైన్ లో లేదా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సమీప కామన్ సర్వీస్ సెంటర్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
సబ్సిడీ పొందాలంటే షరతులు
రైతు తన పేరు మీద వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి. రైతు గడిచిన ఏడేళ్లలో ఎలాంటి ట్రాక్టర్ కొని ఉండకూడదు. ఇతర సబ్సిడీ పథకంతో సంబంధం కలిగి ఉండకూడదు. రైతు కుటుంబం నుంచి ఒకరు మాత్రమే సబ్సిడీకి దరఖాస్తు చేసుకోవాలి. ఒక రైతు ఒక ట్రాక్టర్ పై మాత్రమే సబ్సిడీ పొందగలడు.
కావాల్సిన డాక్యుమెంట్లు రైతు ఆధార్ కార్డు పాన్ కార్డు రైతు పేరిట ఉన్న వ్యవసాయ భూమి పత్రాలు ఓటరు ఐడీ కార్డు/ పాస్ పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్ రైతు బ్యాంకు ఖాతా వివరాలు మొబైల్ నంబర్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
ఈ పథకం దేశంలో ఉన్న సన్నకారు రైతులందరికీ వర్తిస్తుంది. సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ విషయాన్ని మీకు తెలిసిన ప్రతి రైతుకు తెలిసేలా షేర్ చేయండి. అలానే రైతుల కోసం ఆలోచించి సబ్సిడీ మీద ట్రాక్టర్ ని అందిస్తున్న ప్రభుత్వంపై.. మీ అభిప్రాయమేమిటో కామెంట్లలో తెలియచేయండి.