ప్రతిచోటా ప్లాస్టిక్ వాడకం చాలా నార్మల్ అయిపోయింది. మనం ఉపయోగిస్తున్న చాలా వస్తువులు ప్లాస్టిక్ తో చేసినవే.

ఇకపోతే మన కిచెన్ లోనూ చాలా వస్తువులు ప్లాస్టిక్ వే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. నిజానికి ఇది మంచిది కాదు. మన శరీరానికి ప్లాస్టిక్ హాని కలగజేస్తుంది.

ప్లాస్టిక్ లో చాలా చిన్నచిన్న సూక్ష్మ కణాలు ఉంటాయి. అవి విష పదార్థాలు. ఇవి మనల్ని అనారోగ్యం పాలు చేస్తాయి.

అందువల్ల ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించే వారు.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే.

కిచెన్ లో యూజ్ చేసే బాటిల్స్, టిఫిన్ బాక్సులు, కంటెయినర్లలో చాలా కెమికల్స్ ఉంటాయి. వాటిని పాలీ కార్బనేట్ ప్లాస్టిక్స్ అంటారు.

వీటిల్లో బయో యాక్టివ్ కెమికల్స్ అయిన బిస్ ఫినాల్ ఏ(BPA),ఫ్తాలేట్స్ ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటిస్ రోగాలకు కారణమవుతాయి.

BPA ఉన్న వస్తువుల్లో ఫుడ్ ఉంచితే.. దాని ద్వారా BPA మన శరీరంలోకి చేరుతుంది. అది డైరెక్ట్ గా రక్తంలో కలుస్తుంది.

దీని వల్ల సంతాన సమస్యలు, మెటాబాలిజం తగ్గుదల, ఎండోక్రైన్ వ్యవస్థపై ప్రభావం, మెదడు పనితీరు తగ్గుదల, క్యాన్సర్ తదితర వ్యాధులు వస్తాయి.

ప్లాస్టిక్ అతి వినియోగం వల్ల హర్మోన్ల సమస్యలు కూడా  మనకు వస్తాయి.

ప్లాస్టిక్ కి బదులు గ్లాస్ తో తయారు చేసిన వస్తువుల్లో ఫుడ్ నిల్వ చేసేందుకు యూజ్ చేయాలి.

వంటకు, హీట్ చేయడానికి, ఫ్రిజ్ లో పెట్టేందుకు, మైక్రో వేవ్ ఓవెన్ లో పెట్టేందుకు గ్లాస్ పాత్రలు ఎంతో అనుకూలం.

గ్లాస్ పాత్రలు 100 శాతం బోరోసిలికేట్ గ్లాస్ తో తయారు చేస్తారు కాబట్టి.. ఫుడ్ పై ఎలాంటి ప్రభావం ఉండదు.

మట్టిలో కొంతకాలానికి గ్లాస్ కలిసిపోతుంది. పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు.

అదే ప్లాస్టిక్ అయితే మట్టిలో కలవడానికి వందల ఏళ్లు పడుతుంది. పర్యావరణానికి కూడా హాని చేస్తుంది.

మరోవైపు ప్లాస్టిక్ కన్నా గాజు పాత్రలు శుభ్రం చేయడం చాలా తేలిక. తక్కువ ఖర్చుతో సరిపోతుంది.

గాజు పాత్రలు, కంటైనర్లు, జార్ లు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి ప్లాస్టిక్ పాత్రలని వీలైనంత వరకు దూరం పెట్టండి.