ఒక దేశ ప్రధాని అంటే ప్రజల్లో ఎంత గౌరవం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పదవిలో ఉన్న వారిని చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందుతారు.
అలాంటి ప్రధానితో కలసి ఒక ఫొటో దిగే అవకాశం వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా.
ప్రధాని అన్నాక దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్నో కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆయనతో ఎంతో మంది నేతలు, వ్యాపారవేత్తలు ఫొటోలు దిగుతారు.
వీఐపీలే కాదు సందర్భం, వీలును బట్టి విద్యార్థులు, సామాన్యులకు కూడా పీఎంతో ఒక ఫొటో దిగే అవకాశం రావొచ్చు.
అయితే ఇలా దిగిన ఫొటోలను పొందడం కాస్త కష్టమే. వీఐపీలు, పొలిటికల్ లీడర్స్‌కు ఆ ఫొటోలను పొందడం సులువే. కానీ సామాన్యులకు అంత ఈజీ కాదు.
ఈ నేపథ్యంలో ప్రధానితో దిగిన ఫొటోలను తిరిగి పొందేలా నమో యాప్‌లో ఓ సౌకర్యాన్ని తీసుకొచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీతో ఎవరైనా ఫొటో దిగితే దాన్ని పొందొచ్చు. నమో యాప్‌లో ఈ ఫొటోలను పొందే ఛాన్స్ ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రధాని మోడీతో దిగిన ఫొటోలను తిరిగి అందిస్తోంది నమో యాప్.
అందుకోసం ఆ యాప్‌లో ఫొటో బూత్ ఫీచర్‌ను ఇటీవల యాడ్ చేశారని తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఈ యాప్‌లో గత 30 రోజుల ఫొటోలు మాత్రమే చూసే వీలుంది.
త్వరలో నమో యాప్‌ను మరింత అప్డేట్ చేయనున్నారట. దీంతో నెల రోజులకు ముందు దిగిన ఫొటోలను కూడా తేలిగ్గా పొందొచ్చు.
నమో యాప్‌లో మోడీతో దిగిన ఫొటోలను పొందేందుకు ముందుగా ఆ యాప్ ఓపెన్ చేయాలి. అనంతరం ముఖాన్ని స్కాన్ చేసి సెర్చ్ చేయాలి.
ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఒకవేళ ప్రధానితో ఫొటోలు దిగిఉంటే వాటిని యాప్ చూపిస్తుంది.
నమో యాప్‌లో ఫేస్ సెర్చ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వాడుతున్నామని ఆఫీసర్స్ తెలిపారు.