నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఎంటర్టైనర్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి.

మార్చి 17న థియేటర్లలో విడుదలైంది. నాగశౌర్యకు చాలా కాలంగా సరైన హిట్ లేదు.  

ఇక నాగశౌర్యతో ఊహలు గుసగుసలాడే సినిమా తీసి హిట్ కొట్టిన అవసరాల శ్రీనివాస్.. ఆ తర్వాత నారా రోహిత్, నాగశౌర్యలతో కలిసి జ్యోఅచ్యుతానంద సినిమా తీశారు. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు.

దీంతో చాలా గ్యాప్ తీసుకుని మరో ప్రేమ కథతో మన ముందుకు వచ్చారు. మొదటి హిట్ కొట్టిన నాగశౌర్యతోనే మరోసారి తన లక్ ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు అవసరాల శ్రీనివాస్.

మరి ఈ సినిమా ఎలా ఉంది? నాగశౌర్యకు, అవసరాల శ్రీనివాస్ ల హిట్ అవసరం తీర్చిందా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.

కథ: సంజయ్ (నాగశౌర్య), అనుపమ (మాళవిక నాయర్) ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంటారు. ఆ సమయంలో ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు 

ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఇద్దరూ మాస్టర్స్ చదువుకోవడం కోసమని యూకే వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

అనుపమ గురించి ఒక విషయం తెలిసి సంజయ్ ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోతాడు.

అనుపమ గురించి నాగశౌర్యకు ఏం తెలిసింది? సంజయ్ అనుపమకు దూరం అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది? చివరికి ఇద్దరూ కలిశారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: హీరో, హీరోయిన్ ప్రేమలో పడడం.. ఇద్దరి మధ్య గందరగోళ పరిస్థితులు తలెత్తడం.. ఒకరినొకరు దూరమవ్వడం, ఆఖరున పశ్చాత్తపం చెంది కలుసుకోవడం.

ఈ కాన్సెప్ట్ మీద కొన్ని వందల సినిమాలు వచ్చాయి. 

ఈ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా కూడా అదే తరహా కాన్సెప్ట్. అవసరాల శ్రీనివాస్ అదే ఫార్ములాని ఉపయోగించి ఈ సినిమాని తెరకెక్కించారు. కానీ వర్కవుట్ కాలేదు.

ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశంతో సినిమాని ముగిస్తే బాగుణ్ణు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి.

అవసరాల శ్రీనివాస్ ఎంచుకున్న కథ, దర్శకత్వం ప్రేక్షకులను నిరాశపరుస్తాయి.

నటీనటుల పనితీరు: నాగశౌర్య అయోమయానికి గురయ్యే టీనేజ్ కుర్రాడి పాత్రలో, అలానే పరికపక్వత కలిగిన యువకుడి పాత్రలో బాగా నటించారు. ఆ వయసులకు తగ్గట్టు తనను తాను మలుచుకోవడంలో నాగశౌర్య సక్సెస్ అయ్యారు. 

అనుపమ పాత్రలో మాళవిక నాయర్ బాగా నటించింది. అవసరాల శ్రీనివాస్, శ్రీ విద్య, మేఘ చౌదరి తమ పాత్రల మేరకు బాగా నటించారు.

అనుపమ పాత్రలో మాళవిక నాయర్ బాగా నటించింది. అవసరాల శ్రీనివాస్, శ్రీ విద్య, మేఘ చౌదరి తమ పాత్రల మేరకు బాగా నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు: సినిమాలో రెండు పాటలు బాగున్నాయి. సంగీతం ఆహ్లాదకరంగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ పర్లేదు. కథ, కథనం ఇంకా బాగా రాసుకుని ఉంటే బాగుండేది. 

ప్లస్ లు: ఫస్ట్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు నాగశౌర్య, మాళవిక నటన సంగీతం

మైనస్ లు: కథనం క్లైమాక్స్ సెకండ్ హాఫ్ లో వచ్చే బోరింగ్ సన్నివేశాలు

చివరి మాట: ఫలానా ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతుంది

రేటింగ్: 2/5

గమనిక: (ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)