అదీ కాక ఆహారంలో నెయ్యిని భాగం చేయడం వల్ల క్యాన్సర్,అర్థరైటీస్, కంటి శుక్ల వ్యాధుల బారి నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు.
అయితే మార్కెట్ లో చాలా రకాల నెయ్యిలు అందుబాటులో ఉంటున్నాయి.
వాటిల్లో ఏది స్వచ్చమైన నెయ్యి.. ఏది కాదు అని తెలుసుకుని తినాలని సూచిస్తున్నారు నిపుణులు.
అయితే శరీరంలో ఈ కింది లక్షణాలు ఉన్న వారు మాత్రం నెయ్యిని అస్సలు తీసుకోకూడదంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఒకసారి గమనిద్దాం.
జీర్ణశక్తి సరిగా లేని వారు, గ్యాస్, అజీర్ణం, అసిడిటీ లాంటి సమస్యలతో బాధపడే వారు నెయ్యి తీసుకోకూడదు
ఇక కాలేయ సంబంధిత జబ్బులు ఉన్న వారు నెయ్యి తింటే అది వారికి ఓ విషంలా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.