బొప్పాయి పండును తినడం వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
బొప్పాయి పండు తినడం వలన అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
దానిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
ఇక డెంగీ వచ్చిన వారు ప్లేట్ లెట్లు కోల్పోతుంటే బొప్పాయి పండు ద్వారా వాటిని కంట్రోల్ చేయవచ్చు.
అయితే బొప్పాయి పండును తినేవారు మాత్రం కింద ఇచ్చిన కొన్ని సూచనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
గర్భిణీలు బొప్పాయి పండును ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.
ఎందుకంటే బొప్పాయిలో ఉండే పలు రసాయనాలు నేరుగా గర్భాశయంపై ప్రభావం చూపుతాయి.
పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయి పండును తినరాదు. తింటే వారు ఇచ్చే పాలతో పలు రసాయనాలు బిడ్డ శరీరంలోకి వెళ్తాయి.
ఈ పండును బాగా తింటే ఎవరికైనా అన్న వాహికకు ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడూ ఈ పండును తిన్నా ఒక కప్పుకు మించరాదు.
బీపీ సమస్యతో బాధపడేవారు, బీపీ ట్యాబ్లెట్లు వేసుకునే వారు బొప్పాయి పండును తినరాదు.
బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడేవారు బొప్పాయిని తినడంలో జాగ్రత్త వహించాలి.
దీని వల్ల షుగర్ లెవల్స్ బాగా పడిపోతాయి. కనుక బొప్పాయిని వీరు మోతాదులో మాత్రమే తినాలి.
బొప్పాయి పండును తినే పురుషులు వాటి విత్తనాలను తినకుండా, అవి లోపలికి పోకుండా జాగ్రత్త పడాలి.
ఎందుకంటే ఆ విత్తనాలు పురుషుల్లో వీర్యాన్ని నాశనం చేస్తాయి.
ఇక బొప్పాయి పండును ఎవరైనా రోజూ తినవచ్చు..కానీ చాలా తక్కువగా తినాలి.
కనుక బొప్పాయి పండ్లను తినేవారు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
నోట్: పైన టిప్స్ సరిచూసుకునే ముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.