పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగునాట ఈ పేరుకి          ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా      చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక.. నిన్న    మొన్నటి వరకు సినిమాలకే పరిమితం అయిన  జనసేనాని ఇప్పుడు పొలిటికల్ గా స్పీడ్ పెంచారు.

            మంగళగిరిలోని ఇప్పటం గ్రామ పంచాయతీ            వేదికగా జరిగిన జనసేన 9వ  ఆవిర్భావ సభ..            ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.         ఈ వేదికపై నుండి పవన్ వైసీపీపై విరుచుకపడ్డారు.  సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ.. చాలా అంశాలను లేవనెత్తారు.  

దీంతో.. ఇప్పుడు అంతా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది    జగన్ నే అని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. కానీ..,      జనసేన ఆవిర్భావ సభ ద్వారా, పవన్ స్పీచ్ ద్వారా           ఎక్కువ నష్టం జరిగింది మాత్రం టీడీపీకే.  పవన్      కళ్యాణ్ టార్గెట్ చేసింది కూడా చంద్రబాబునే అన్న               అంశం ఇప్పుడు ఒకటి తెరపైకి వస్తోంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగునాట ఈ పేరుకి          ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా      చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక.. నిన్న    మొన్నటి వరకు సినిమాలకే పరిమితం అయిన  జనసేనాని ఇప్పుడు పొలిటికల్ గా స్పీడ్ పెంచారు.

2024 ఎన్నికల కోసం షణ్ముఖ వ్యూహంతో ముందుకి  పోతున్నట్టు పవన్ చెప్పారు. అప్పుల్లేని ఆంధ్రప్రదేశ్,  పెట్టుబడులు పెంచడం కోసం ఫ్రెండ్లీ ఇన్వెస్టిమెంట్  సిస్టమ్, రాష్ట్రంలో విశ్వనగరంగా విశాఖపట్నం, హైటెక్                           సిటీలుగా విజయవాడ, 

  తిరుపతిని అభివృద్ధి చేయడం, ఏడాదికి 5 లక్షల  మంది యువతకి ఉద్యోగాలు కల్పించడం, స్వయం     ఉపాధికి అర్హులైన యువత ఖాతాల్లో 10 లక్షల  రూపాయల డబ్బులు వేయడం, తెల్లరేషన్ కార్డులు      ఉన్నవారికి వారికి ఫ్రీ ఇసుక ఇవ్వడం వంటి                          హామీలు గుప్పించారు.  

  కానీ..,  హామీలు అన్నీ ఇవ్వాల్సింది ఎవరు? సీఎం  కావడానికి పోటీ పడే అభ్యర్థి. పవన్ ఇప్పుడు ఆ పనే  చేశారు. 2024 నుండి రాష్ట్ర బాధ్యత నాది అన్నారు.               తాను సీఎం కావడం ఖాయం అని కూడా    ప్రకటించుకున్నారు. ఇదే చంద్రబాబుకి చెక్ పెట్టే                               అంశంగా మారింది. 

  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వను, వ్యక్తిగత   ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో      పెట్టుకుని ముందుకి వచ్చిన పార్టీలతో పొత్తు  ఉంటుందని పవన్ తెలియజేశారు. అంటే.. తనని  ముఖ్యమంత్రి అభ్యర్థిగా గుర్తించి ముందుకి వస్తేనే.. 

    టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ చెప్పకనే     చెప్పినట్టు అయ్యింది. టీడీపీ దీనికి అంగీకరిస్తే..            ఇక బాబు జీవితంలో సీఎం కాలేరు.         అంగీకరించకపోతే జగన్ ని దెబ్బ కొట్టడం         కుదరదు. ఇలా ఏ విధంగా చూసుకున్నా..  

పవన్ స్పీచ్ తో ఇరకాటంలో పడింది చంద్రబాబే  అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. పైగా.. , పవన్ విమర్శల కారణంగా వైసీపీకి కొత్తగా వచ్చే  నష్టం ఏమి లేదు. ఎందుకంటే.. పవన్ ముందు        నుండి వైసీపీని విమర్శిస్తూనే వస్తున్నారు. 

కాబట్టి.. ఇప్పుడు చంద్రబాబుకే కొత్త కష్టం వచ్చి  పడినట్టు అయ్యింది. మరి.. ఈ విషయంలో మీ        అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో                           తెలియజేయండి.