'అజ్ఞాతవాసి' తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్న పవన్.. 2021లో 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చారు. హిట్ కొట్టారు.
గతేడాది ఫిబ్రవరిలో 'భీమ్లా నాయక్'గా వచ్చి బ్లాక్ బస్టర్ రెస్పాన్ అందుకున్నారు. దీని తర్వాత మరో సినిమా రాలేదు.
ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో హరిహర వీరమల్లు, #PKSDT,OG సినిమాలతో బిజీగా ఉన్నారు.
వీటిలో 'హరిహర వీరమల్లు' చివరి దశలో ఉండగా.. PKSDTలో పవన్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది.
తాజాగా 'OG' సెట్ లో పవన్ కల్యాణ్ అడుగుపెట్టారు. గ్యాంగస్టర్ డ్రామాగా ఈ సినిమాని తీస్తున్నారు.
'సాహో' ఫేమ్ సుజీత్ డైరెక్టర్ గా, పవన్ తో చేస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఎందుకంటే 'పంజా' తర్వాత పవన్ మరో గ్యాంగస్టర్ టైప్ మూవీ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ లో లాంఛనంగా షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలోనే బ్లాక్ కలర్ హుడీలో పవన్ సందడి చేశారు.
సినిమాతో పాటు పవన్ హుడీ కాస్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఆ హుడీ కాస్ట్ ఎంతనేది ఇప్పుడు తెలిసిపోయింది. భారత కరెన్సీ ప్రకారం రూ.5 వేల రూపాయలని తెలుస్తోంది.
వేరే దేశం నుంచి రావాల్సి ఉంటుంది కాబట్టి షిప్పింగ్ ఛార్జీలతో కలిపి.. రూ.7,500 వరకు అవుతుందని తెలుస్తోంది.
దీన్నిబట్టి చూస్తుంటే.. అందరూ కాకపోయినా సరే కొందరు ఫ్యాన్స్ అయినా సరే ఈ హుడీని కొనుగోలు చేయొచ్చు.
మరి మీలో ఎవరైనా కొనాలనుకుంటున్నారు. అయితే మా వెబ్ సైట్ లో స్టోరీ ఉంది. అందులో హుడీ లింక్ ఉంది.
దాన్ని మీరు క్లిక్ చేస్తే ఫుల్ డీటైల్స్ వస్తాయి. నచ్చితే కొనుక్కోండి. లేదంటే చూసి లైట్ తీసుకోండి.