హాస్పిటల్‌లో  చికిత్స పొందుతున్న  సాయిధరమ్‌ తేజ్‌  కొత్త సినిమా రిపబ్లిక్‌ సినిమా  అక్టోబర్‌ 1న రిలీజ్‌ అవుతున్న  సంగతి తెలిసిందే.

రెండు వారాల క్రితం ప్రమాదానికి గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సాయిధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా రిపబ్లిక్‌  అక్టోబర్‌ 1న రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

దానికి కంటే ముందు ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఈ నెల 25(శనివారం) నిర్వహించేందుకు చిత్రబృందం సిద్ధమైంది.

ఈ కార్యక్రమానికి తేజ్‌ మేనమామ పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. గతంలో కూడా తేజ్‌ సినిమా ఫంక్షన్లకు మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ హాజరయ్యారు.

ఈ రిపబ్లిక్‌ సినిమా ట్రైలర్‌ను కొద్ది రోజుల ముందే మెగాస్టార్‌చిరంజీవి రిలీజ్‌ చేస్తూ తేజ్‌ కోరిక మేరకే సినిమాను అక్టోబర్‌ 1న రిలీజ్‌ చేస్తున్నామని తెలియజేశారు.

తేజ్‌ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థనలు కూడా చేశారు. కాగా తేజ్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారంటూ డాక్టర్లు తెలియజేశారు. ఆయన పూర్తిగా కోలుకుని ఒక సారి మాట్లాడితే వినాలని ఆయన అభిమానులతో పాటు సినీ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది.

ఈ క్రమంలోనే ఆయన సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ రావడంతో అందరి కళ్లు ఆ కార్యక్రమంపై పడ్డాయి. ఈ ఈవెంట్‌కు తేజ్‌ వస్తాడా? రాడా? అనే చర్చ సినీ వర్గాల్లో, మెగా అభిమానుల్లో జోరుగా సాగుతోంది. 

పవర్‌స్టార్‌ ముఖ్యఅతిథిగా తేజ్‌ లేకుండానే ఈ కార్యక్రమం జరుగుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తేజ్‌ వస్తాడో లేదో తెలియాలంటే ఈవెంట్‌ చూడాల్సిందే.