మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లలో బొప్పాయి పండు కూడా ఒక‌టి

బొప్పాయి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది.

మ‌నం బొప్పాయి పండును తిని దానిలో ఉండే గింజ‌ల‌ను ప‌డేస్తాము. 

బొప్పాయి పండు కంటే అందులో ఉండే గింజ‌లే అధిక పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. 

బొప్పాయి గింజ‌ల‌లో ఉండే ఔష‌ధ గుణాల గురించి, పోష‌కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి గింజ‌ల‌ను త‌క్కువ మోతాదులో తిన‌డం వ‌ల్ల శరీరానికి మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. 

ఈ బొప్పాయి గింజ‌లు సాధార‌ణ, దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్యల నుండి కాపాడుతుంది.

బొప్పాయి గింజ‌ల‌లో ఉండే  ఫైబ‌ర్ వ‌ల్ల అజీర్తి వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి.

కొవ్వును క‌రిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఈ గింజలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

జీర్ణకోశ సంబంధిత స‌మ‌స్యల బారిన ప‌డ‌కుండా బొప్పాయి గింజలు స‌హాయ‌ప‌డ‌తాయి.

బొప్పాయి గింజ‌ల‌ను చేదుగా ఉంటాయి కనుక చాలా మంది నేరుగా తిన‌లేరు. 

ఈ గింజ‌ల‌ను పొడిగా చేసి ఆ పొడిని మ‌నం తాగే జ్యూస్ ల‌లో క‌లుపుకుని తీసుకోవ‌చ్చు.

బొప్పాయి గింజ‌ల‌కు తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల‌లో వ‌చ్చే సంతాన లేమి స‌మ‌స్యలు త‌గ్గుతాయి.

మూత్ర పిండాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 

 మిరియాల‌కు బ‌దులుగా వంట‌ల్లో బొప్పాయి గింజలు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు