112 ఏళ్ల రికార్డు బద్దలు!  పాక్‌పై తొలి రోజు  506 పరుగులు, 4 సెంచరీలు

17 ఏళ్ల లాంగ్‌ గ్యాప్‌ తర్వాత.. పాక్‌ గడ్డపై  అడుగుపెట్టి టెస్టు క్రికెట్‌ ఆడుతున్న ఇంగ్లండ్‌  ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

1910లో ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికాపై  సిడ్నీలో టెస్టు ఆడుతూ.. తొలి రోజు 6 వికెట్లు  కోల్పోయి 494 పరుగులు చేసింది. తాజాగా  ఇంగ్లండ్‌ 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏకంగా ' కేవలం 4 వికెట్లు కోల్పోయి 506 పరుగుల  భారీ స్కోర్‌ చేసింది. పైగా నలుగురు ఆటగాళ్లు  సెంచరీల మోతమోగించారు.

ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్‌ డకెట్‌  పాకిస్థాన్‌ బౌలర్లతో చెడుగుడు ఆడుకున్నారు.  తొలి వికెట్‌కు ఈ జోడి ఏకంగా 233 పరుగులు  జోడించింది.

తొలి వికెట్‌ తీసేందుకు పాకిస్థాన్‌ బౌలర్లు  చెమటలు కక్కి, మూడు చెరువుల నీళ్లు  తాగారు. 

110 బంతుల్లో 15 ఫోర్లతో 107 పరుగులు చేసి  బెన్‌ డకెట్‌ అవుట్‌ అయ్యాడు. డకెట్‌ ఏకంగా 6  ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఇంగ్లండ్‌ టెస్టు టీమ్‌లోకి  వచ్చాడు.

ఇక మరో ఓపెనర్‌ జాక్‌ 111 బంతుల్లో 21  ఫోర్లతో 122 పరుగులు బాది.. కొద్ది సేపటికే  హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

మధ్యలో జో రూట్‌ 23 పరుగులు చేసి త్వరగానే  అవుటైనా.. బ్రూక్స్‌, పోప్‌ జోడీ పాక్‌ బౌలర్లపై  విరుచుకుపడింది

ఈ క్రమంలో పోప్‌ 104 బంతుల్లో 14 ఫోర్లతో  108 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. ఈ సారి  మొహమ్మద్‌ అలీ వికెట్‌ పడగొట్టాడు.

సెంచరీలు బాది ముగ్గురు ఆటగాళ్లు జాక్‌,  డకెట్‌, పోప్‌ వన్డేల్లో స్టైల్లో బ్యాటింగ్‌ చేస్తే..

బ్రూక్స్‌ ఏకంగా టీ20ల్లో పాక్‌ బౌలర్లను  చీల్చిచెండాడు. 81 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సులు  బాది 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

బెన్‌ స్టోక్స్‌ సైతం క్రీజ్‌లోకి వచ్చిరాగానే బాదడం  మొదలుపెట్టాడు. కేవలం 15 బంతులే ఆడి స్టోక్స్‌  6 ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 34 పరుగులతో నాటౌట్‌గా  నిలిచాడు.

ఇలా 75 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్‌  506 పరుగుల చేసిన దశలో, బ్యాడ్‌ లైట్‌  కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను  నిలిపివేశారు.

రావాల్పింది టెస్టు కోసం ఏర్పాటు చేసిన పిచ్‌పై  మ్యాచ్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే తీవ్ర స్థాయిలో  విమర్శలు వస్తున్నాయి.