నటి పాకీజా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
1990 కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా వందల చిత్రాల్లో నటించింది.
అయితే చేతి నిండా అవకాశాలు ఉన్నప్పుడు ఆమె జాగ్రత్త పడలేదు.
ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేక.. అటు అవకాశాలు రాక.. అంత్యంత దీన స్థితిలో జీవితం వెళ్లదీస్తోంది.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పాకీజాను సుమన్ టీవీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది.
ఆమె ఎదుర్కొంటున్న కష్టాల గురించి బయటి ప్రపంచానికి తెలియజేసింది.
ఈ ఇంటర్వ్యూలో పాకీజా.. ప్రస్తుతం తన చేతిలో డబ్బు లేదని, అవకాశాలు కూడా లేవని చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీకి చెందిన వారు.. తనను ఆదుకోవాలని.. అవకాశాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.
పాకీజా ఇబ్బందుల గురించి తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు స్పందించారు.
ఆమెకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ విషయాన్ని పాకీజా స్వయంగా వెల్లడించింది.
ఇక తాజాగా ఆమెకు అవకాశాలు కూడా వస్తున్నాయి. ఓ బుల్లితెర షోలో ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది
ఇక పాకీజా అనగానే ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు వచ్చేది అసెంబ్లీ రౌడీ చిత్రంలోని సన్నివేశాలు.
ఈ సినిమాలో బ్రహ్మానందం-పాకీజాల మధ్య వచ్చే కామెడీ ట్రాక్ హైలెట్.
ఈ సినిమాలో పాకీజా అనగానే.. కళ్లకు అద్దాలు .. చేతిలో గొడుగు పట్టుకుని.. టిప్‌టాప్‌గా ముస్తాబై.. నడిచి వచ్చే దృశ్యమే గుర్తుకు వస్తుంది.
ఇక తాజాగా రీఎంట్రీలో కూడా ఆమె అదే గెటప్‌లో ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చింది.
మార్చి 24, శుక్రవారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో పాకీజా సందడి చేయనుంది.
ఎపిసోడ్లో భాగంగా రాకింగ్ రాజేష్ టీమ్‌లో ఎంట్రీ ఇచ్చింది పాకీజా.
పాకీజా రీ ఎంట్రీపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలానే ఆమెకు అవకాశాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.