సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్‌ వేడుకలు ముగిశాయి.

ఈ ఏడాది భారత్‌ రెండు ఆస్కార్‌ అవార్డులు గెలుచుకుంది.

బెస్ట్‌ షార్ట్‌ ఫిలిం విభాగంలో ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌, ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నాటు నాటు పాట అవార్డు గెలుచుకున్నాయి.

తెలుగు పాటకు ఆస్కార్‌ అవార్డ్‌ రావడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ టీం మీద ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో ఆస్కార్‌ విజేతకు ఎంత ప్రైజ్‌ మనీ ఉంటుంది అనే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఆస్కార్‌ విన్నర్స్‌కు లభించే ప్రైజ్‌ మనీ కేవలం జీరో. అనగా ఒక్క రూపాయి కూడా ప్రైజ్‌ మనీ లభించదు.

ఆస్కార్‌ విజేతకు ఎలాంటి క్యాష్‌ ప్రైజ్‌ ఇవ్వరు. నామినీస్‌కు మాత్రం కోటి రూపాయల గిఫ్ట్‌ హ్యాంపర్‌ లభిస్తుంది.

సినీ రంగంలో నోబెల్‌ ప్రైజ్‌తో సమానమైన ఆస్కార్‌కు ప్రైజ్‌ మనీ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశమే.

ఇక ఆస్కార్‌ అమ్మడానికి కానీ, వేలం వేయడానికి కూడా వీలు లేదు.

ఆస్కార్‌ ప్రతిమ పూర్తిగా బంగాంతో చేసేది కూడా కాదు. కేవలం కోటింగ్‌ మాత్రమే.

ఆస్కార్‌ అవార్డు రావడమే చాలా అరుదైన అంశంగా భావిస్తారు. ప్రైజ్‌ మనీ గురించి ఆలోచించరు.