మరి, తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
అర్జున్( విశ్వక్ సేన్), అను( మితిలా పార్కర్) చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. అనుకోని కారణాల వల్ల ఇద్దరూ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.
తర్వాత దేవుడు(వెంకటేష్) అర్జున్ జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడు. దేవుడి ఎంట్రీతో అర్జున్ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది?
అనుతో అర్జున్ విడాకులు తీసుకుంటాడా? లేక ఆమెను అర్థం చేసుకుని ఆమెతోనే ఉండిపోతాడా? ఇంతకీ ఏం జరుగుతుందన్నదే మిగితా కథ.
దర్శకుడు అశ్వత్ పాత కథనే పాలిష్ పట్టి కొత్తగా తీర్చి దిద్దారు. తన స్క్రీన్ ప్లేతో సినిమాను అద్భుతంగా మలిచారు. సినిమా మొత్తం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.
హీరో,హీరోయిన్ల విషయానికి వస్తే.. తమిళంలో అశోక్ సెల్వన్, రితికా సింగ్ చేసిన పాత్రలో విశ్వక్ సేన్, మితిలా పార్కర్ ఒదిగిపోయారు.
తమిళంలో విజయ్ సేతుపతి చేసిన దేవుడి క్యారెక్టర్‌ను తెలుగులో విక్టరీ వెంకటేష్ నభూతో నభవిష్యతిగా చేశారు.
సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఈ సినిమాలోని చాలా పాటలు అద్భుతంగా గుండెను మీటే విధంగా ఉంటాయి.
అందుకు తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అవసరం. ఈ విషయంలో లియోన్ జేమ్స్‌కు నూటికి నూటొక్క మార్కులు వేయోచ్చు.
మొత్తానికి ‘ఓరి దేవుడా’ సినిమా ఓ మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్.