ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయకూడా చేయదని పెద్దలు అంటుంటారు.

అలానే ఉల్లిపాయలను ఆహారంలో తీసుకోవడం వలన  ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఉల్లి ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది.

ఉల్లిపాయలోని యాంటీసెప్టిక్‌ గుణాలు చర్మ సమస్యలకు నివారిచడంలో సాయపడుతుంది.

అలానే ఉల్లిపాయలలోని యాంటీసెప్టిక్స్ చర్మంపై ఉండే  మచ్చలను తొలగిస్తాయి

ఒక టేబుల్‌ స్పూన్‌ ఉల్లి రసంలో స్పూన్‌ ఆలివ్‌ నూనెను కలిపి ముఖానికి రాసుకోవాలి.

అలా ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి.

అలానే ఓ టీ స్పూన్‌ పసుపులో సరిపడా ఉల్లిపాయ రసాన్ని కలిపి పేస్ట్‌ గా చేసుకోవాలి.

ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ లా వేసుకుని  కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

దీంతో మీ ముఖం చంద్రబింబం వలే మెరిసిపోతుంది.

శనగపిండి, ఉల్లిరసం, పాలు .. సమానంగా తీసుకొని పేస్ట్‌లా  చేసుకుని ముఖానికి రాసుకోవాలి.

సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని ఉల్లి తగ్గిస్తుంది.

ఉల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు యూవీ కిరణాల వల్ల కలిగే హానిని అడ్డుకుంటాయి.

ఇవి కేవలం  ఆరోగ్య నిపుణలు సలహా మేరకు ఇవ్వడం జరుగింది.

ఏదైన చర్మ సమస్యలు ఉంటే  మీ వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.