‘వన్‌ప్లస్‘.. స్మార్ట్‌ఫోన్ వాడే వారికీ ఈ పేరును పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. కాకుంటే.. కాస్త ధర ఎక్కువ. గతంలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే.. దాని రేట్ ఎక్కువ.. అంత డబ్బు మనమెక్కడ పెట్టగలం అనేవారు.
అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని.. మరింత మందికి దగ్గర అవ్వాలనే ఉద్దేశ్యంతో.. వన్‌ప్లస్ సంస్థ ‘నార్డ్ సిరీస్’ ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ ధర రూ.20 నుంచి 30 వేల ఉండడంతో.. యూజర్స్ వన్ ప్లస్ కు బాగానే అట్ట్రాక్ట్ అయ్యారు.
వినియోగదారులకు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశ్యంతో రూ.20,000 బడ్జెట్‌లో నార్డ్ సీఈ 2 5G లైట్ మోడల్ తీసుకురానుందని వార్తలొస్తున్నాయి. తాజాగా.. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ 10 ప్రో‘ను లాంచ్ చేసింది.
ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలైన నేపథ్యంలో వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్లపై గరిష్టంగా రూ. 10 వేల వరకు తగ్గించింది. ఈ తగ్గింపు ధర.. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, దేశవ్యాప్తంగా ఉన్న వన్‌ప్లస్ అధీకృత రిటైల్ స్టోర్స్‌లో లభిస్తాయి.
వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో రెండు మోడల్స్ 8GB + 128GB, 12GB+ 256GB వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.
మోడల్ వన్‌ప్లస్ 9 (8GB + 128GB) అసలు ధర రూ.49,999 ప్రస్తుత ధర రూ.40,599 డిస్కౌంట్ రూ.9,400
మోడల్ వన్‌ప్లస్ 9 (12GB + 256GB) అసలు ధర రూ.54,999 ప్రస్తుత ధర రూ.45,599 డిస్కౌంట్ రూ.9,400
మోడల్ వన్‌ప్లస్ 9 ప్రో (8GB + 128GB) అసలు ధర రూ.64,999 ప్రస్తుత ధర రూ.54,199 డిస్కౌంట్ రూ.10,800
మోడల్ వన్‌ప్లస్ 9 ప్రో (12GB + 256GB) అసలు ధర రూ.69,999 ప్రస్తుత ధర రూ.59,199 డిస్కౌంట్ రూ.10,800
(వన్‌ప్లస్ 9 స్పెసిఫికేషనన్స్) 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 48MP + 50MP + 2MP రియర్ కెమెరా 16ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,500mAh బ్యాటరీ 65W ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 11 వర్షన్
(వన్‌ప్లస్ 9 ప్రో స్పెసిఫికేషనన్స్) 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 48MP + 8 MP + 50MP + 2MP రియర్ కెమెరా 16ఎంపీ సెల్ఫీ కెమెరా4,500mAh బ్యాటరీ 65W ఛార్జింగ్ సపోర్ట్‌ఆండ్రాయిడ్ 11 వర్షన్