చిల్లర అని కొన్నిసార్లు పక్కన పడేసిన నాణేలు మిమ్మల్ని లక్షాధికారిణి చేయచ్చు.

ఒక్కోసారి ఇష్టంగా దాచుకున్న చిల్లర డబ్బులతోనే లక్షలు సంపాదించవచ్చు.

అవునండి ఇప్పటి వరకు ఇలాంటివి మీరు చాలానే చూశారు.

అయితే ఈసారి ఇది కాస్త విభిన్నంగా ఉంటుంది.

అది ఒక పాత రూపాయి నాణెం. మీరు చాలాసార్లు చూసుంటారు.

 మీ లైఫ్ లో ఒక్కసారైనా ఆ నాణేన్ని వాడి ఉంటారు.

ఇప్పుడు ఆ రూపాయి నాణెం మీ దగ్గరుంటే అది మీకు దాదాపు రూ.2.5 లక్షలు తెచ్చిపెట్టగలదు.

DNA నివేదిక ప్రకారం 1985 సంవత్సరంలో మూద్రించిన పాత రూపాయి నాణెం అది. 

దానిపై ఒకవైపు మొక్కజొన్న కంకులు.. మరోవైపు అశోక స్తంభం ఉంటాయి.

అయితే ఆ నాణెంలో ఇంకో ప్రత్యేకత ఉండాలి.

దానిపై మొక్కజొన్న కంకులవైపు కిందభాగంలో ‘H’ అని ఉండాలి.

అలాంటి కాయిన్ రూ.2.5 లక్షలకు వేలం వేయబడింది. 

మీ దగ్గర అలాంటి రూపాయి ఉంటే మీకు రూ.2.5 లక్షలు దాకా దక్కే అవకాశం ఉంది.

ఈ కాయిన్ ను మన దేశంలోనే కాకుండా యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన రెండు ముద్రాణా సంస్థలు కూడా ముద్రించాయి. 

1991లో చివరిగా ఈ రకం కాయిన్ ను ముద్రించారు.