ఫోన్ అనగానే అందరూ స్మార్ట్ ఫోన్ మాత్రమే కొంటున్నారు.
ఈమధ్యకాలంలో అది కాస్తా 5జీకి అప్ గ్రేడ్ అయ్యింది. కొత్తగా ఫోన్ అంటే అంతా 5జీ ఫోన్ నే కొంటున్నారు.
ఇంక స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు.. స్మార్ట్ గ్యాడ్జెట్స్ కూడా కొనాలి కదా?
స్మార్ట్ గ్యాడ్జెట్స్ అంటే ముందుగా ఇయర్ బడ్స్ గురించే మాట్లాడతారు.
జాబ్ చేసే వాళ్లు ఇవన్నీ కొంటే ఓకే.. జీతం వస్తుంది కొనుక్కుంటారు.
స్టూడెంట్స్ ఇలా 5జీ ఫోన్, ఇయర్ బడ్స్ కావాలి అని అడిగితే పేరెంట్స్ క్లాస్ పీకడం ఖాయం.
మీరు ఏం దిగులు పడకండి. మీ పేరెంట్స్ ని వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ కొనివ్వమని చెప్పండి.
ఎందుకంటే ఇప్పుడు వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ కి నార్డ్ బడ్స్ ఈసీ ఉచితంగా లభిస్తున్నాయి.
రూ.19,999 పెట్టి మీరు స్మార్ట్ ఫోన్ కొంటే మీకు రూ.2,299 విలువజేసే బడ్స్ ఫ్రీగా వస్తున్నాయి.
అయితే ఇది పరిమితకాలం ఆఫర్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి.
ఏప్రిల్ 11న ఎవరైతే ఈ వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ ఫోన్ కొనుగోలు చేస్తారో వారికే ఈ బడ్స్ లభిస్తాయి.
అది కూడా స్టాక్ ఉన్నంత వరకే ఈ ఇయర్ బడ్స్ అందజేస్తామని కండిషన్ పెట్టారు.
ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 11 మధ్యాహ్నం నుంచి సేల్ కి వస్తోంది.
ఇందులో 6.72 లార్జ్ డిస్ ప్లే, 120 హెట్స్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది.
ఆక్సిజన్ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108 ఎంపీ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది.