దణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది.

ఇది డల్టావేరియంట్ కన్నా ప్రమాదకరమైన వేరియంట్ అంటూ ప్రచారాలు మొదలయ్యాయి. 

ఒమిక్రాన్ అంత భయంకరమైనదేమీ కాదని కొందరు, అది చాలా డేంజరని మరికొందరు చెబుతుండడంతో ప్రజలు అయోమయం చెందుతున్నారు. 

గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ అతలాకుతలం అయ్యింది.

ఆన్ లైన్ క్లాసులు మొదలైనా.. కొంత మంది విద్యార్థులు, తల్లిదండ్రులు దానిపై దృష్టిపెట్టకపోవడం చూస్తూనే ఉన్నాం. 

విద్యార్థులు సెల్ ఫోన్లకు అడెక్ట్, ఎడ్యూకేషన్ పై పూర్తిగా పట్టుకోల్పోవడం చూశాం. 

కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించారు. 

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభించనుందనే భయాల నేపథ్యంలో  తెలంగాణలో స్కూళ్లు బంద్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.  

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ఇచ్చేసిందని ప్రచారం నడుస్తోంది.

ఈ వార్తలు కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో తీవ్రంగా స్పందించారు విద్యాశాఖ మంత్రి.  

సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... సోషల్ మీడియలో జరుగుతున్నది తప్పుడు ప్రచారమేనని అన్నారు. రాష్ట్రంలో విద్యాసంస్థలు యథావిధిగా నడుస్తాయని చెప్పారు.

స్కూళ్లు మూతపడబోతున్నాయనే వార్తలను విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని కోరారు. 

విద్యాసంస్థల యాజమాన్యాలు కొవిడ్ నిబంధనలను, జాగ్రత్తలను పాటించాలని అన్నారు. 

మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. 

ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో సైతం స్కూళ్లు నడపాల్సిందేనని సీఎం చెప్పారని మంత్రి వెల్లడించారు.