ఇటీవల కాలంలో గుండె పోటులతో సంబంధించిన మరణాల సంఖ్య బాగా పెరిగింది

వయస్సుతో సంబంధం లేకుండా యువకులు సైతం గుండె పోటుకు గురవుతున్నారు.

 ఎంతో ఆరోగ్యం కనిపించే వారు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృత్యువాత పడుతున్నారు.

6 రోజుల వ్యవధిలో 5 సార్లు గుండె పోటుకు గురైన  81 ఏళ్ల వృద్ధురాలు మాత్రం మృత్యుంజయురాలిగా  నిలిచారు.

వైద్య రంగంలోని ఇదే ఓ అద్భుతమైన ఘటన అని డాక్టర్లు అంటున్నారు.

ఢిల్లీకి చెందిన 81 ఏళ్ల వృద్ధురాలు శ్వాసకోస సంబంధిత సమస్యలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది.  

అప్పటికే ఆమె శ్వాస తీసుకునేందు చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఆమెను పరీక్షించి.. గుండె సామర్థ్యం 25 శాతానికి పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు.

అలానే గుండె స్పందనలోనూ కూడ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

దీంతో ఆమెకు ఏంజియోగ్రఫీ చేసి తాత్కలికంగా పేస్ మేకర్ అమర్చారు.

ఇలా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆమెకు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.

దీంతో వెంటనే వైద్యులు ఏఐసీడీ అనే పరికరం సాయంతో గుండెను తిరిగి కొట్టుకునేలా చేశారు.

దీంతో బాధితురాలి గుండె  పనితీరు బాగానే ఉందని, అలానే క్రమంగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు.

అయితే చికిత్స అందించే సమయంలో 6 రోజుల వ్యవధిలో 5 సార్లు గుండె పోటు వచ్చిందంట.

ఆ సమయంలో వైద్యులు అనేక ప్రత్యామ్నాయాలను పరిశీలించి.. చివరకు ఏఐసీడీతో ఆమె ప్రాణాలను నిలిపారు.

ఇక వైద్యులు అందించిన ఈ చికిత్సతో ఆ బామ్మ పూర్తిగా కోలుకుని ఇటీవలే డిశ్చార్జ్  అయ్యారు.