పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలంటూ ప్రభుత్వాలు సైతం సూచిస్తున్నాయి.

ఇప్పటికే విద్యుత్ వాహన తయారీ కంపెనీలు, కొనుగోలుదారులకు ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి.

ఆఫర్స్‌- డిస్కౌంట్స్‌ వంటివి ఉండటం వల్ల విద్యుత్ వాహనాల వాడకం ఇప్పుడు బాగా పెరిగింది.

ఈవీల్లో ముఖ్యంగా ఓలా కంపెనీకి మంచి గుర్తింపు, ఆదరణ లభించింది.

ఇప్పటికే ఓలా ఎస్1, ఎస్1 ప్రో వాహనాలు మార్కెట్ లో అందుబాటుల ఉన్నాయి.

ఈ వాహనాలను విరివిగా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కేవలం ఓలా ఎస్1 మోడల్ నే 2 లక్షల మందికి పైగా కొన్నారు.

అయితే తర్వాత ఓలా ఎస్1 ప్రో వాహనాలపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత వచ్చింది.

బండి ఛాసిస్‌ చాలా వీక్ గా ఉందని, ఊరికే విరిగిపోతోందంటూ ఫిర్యాదులు వచ్చాయి.

ఈ ఫిర్యాదులు, నెట్టింట వైరల్ అయిన ఇమేజెస్ మొత్తానికి ఓలా ఎస్1 వాహనాల మార్కెట్ పై ప్రభావం చూపించాయి.

ఇప్పుడు ఓలా ఆ నెగిటివిటీ, ఫిర్యాదులపై స్పందించింది.

తాము చేసే క్వాలిటీ టెస్టుల గురించి తెలిసేలా వీడియోలు కూడా విడుదల చేసింది.

అంతేకాకుడాం ఓలా ఫ్రంట్ వీల్ ఫోర్క్‌ డిజైన్ ని అప్ గ్రేడ్ చేసింది.

పాత కస్టమర్లు సైతం వారి వాహనానికి ఫ్రంట్ వీల్ ఫోర్క్‌ అప్ గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే ఉచితంగా చేస్తామని ప్రకటించారు.

మార్చి 22 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభంకానుంది. దీనికోసం ముందుకు మీరు అపాయిట్మెంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

మీ ఓలా ఎస్1 వాహనం ఫ్రంట్ ఫోర్క్‌ పై నమ్మకం లేకపోతే మీరు దానిని ఫ్రీగా అప్ గ్రేడ్‌ చేసుకోవచ్చు.