ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన తర్వాత రిఫండ్ ఇవ్వడం అనేది అసాధ్యం.

కానీ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ అయిన ఓలా మాత్రం తమ కస్టమర్లకు రిఫండ్ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

ఏకంగా రూ. 9 వేల నుంచి రూ. 19 వేల వరకూ రిఫండ్ అమౌంట్ ని ఇవ్వనుంది.

విద్యుత్ వాహనం కొనుగోలు చేసిన కస్టమర్లకు ఓలా కంపెనీ రూ. 9 వేల నుంచి రూ. 19 వేల వరకూ రిఫండ్ ఇస్తుంది.

2019-2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 మార్చి 30 వరకూ ఓలా ఎస్1 ప్రో స్కూటర్ కొన్నవారికి ఈ రిఫండ్ వర్తిస్తుంది.

స్కూటర్ కొనుగోలు చేసిన సమయంలో బ్యాటరీ ఛార్జర్ కి ప్రత్యేకంగా ధర చెల్లించే ఉంటారు.

అలాంటి వారికి బ్యాటరీ ఛార్జర్ డబ్బులను ఇప్పుడు వెనక్కి ఇచ్చేస్తుంది.    

అధిక ధరలపై భారీ పరిశ్రమల శాఖ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఓలా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల నుంచి ఛార్జర్ కోసం వసూలు చేసిన ఛార్జర్ డబ్బులను రిఫండ్ చేసిన అనంతరం సబ్సిడీ డబ్బులు ఇస్తామని ప్రభుత్వం వెల్లడించడంతో కంపెనీ రిఫండ్ చేస్తున్నట్లు తెలిపింది.

తమ కస్టమర్లకు రూ. 130 కోట్లు రిఫండ్ చేస్తున్నట్లు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) కి రాసిన లేఖలో ఓలా పేర్కొంది.

2019-20వ ఆర్థిక ఏడాది నుంచి 2023 మార్చి 30 వరకూ కస్టమర్లు ఎవరైతే ఓలా ఎస్1 ప్రో మోడల్ కొనుగోలు చేశారో వారికి ఈ రిఫండ్ వర్తిస్తుంది.

ఈవీ కొనుగోలు సమయంలో బ్యాటరీ ఛార్జర్ ను సెపరేట్ గా రూ. 9 వేల నుంచి రూ. 19 వేల వరకూ చెల్లించి కొని ఉంటారు.

సెపరేట్ గా డబ్బు చెల్లించి ఛార్జర్ ను కొనుగోలు చేసిన వారందరికీ రూ. 130 కోట్లు రిఫండ్ చేస్తున్నట్లు ఏఆర్ఏఐకి రాసిన లేఖలో ఓలా కంపెనీ పేర్కొంది.