బ్యాంకింగ్ రంగంలో ఇప్పుడు ఎంతో ప్రాచుర్యం కలిగినది, ఎక్కువ డిమాండ్ కలిగినది క్రెడిట్ కార్డు.
ఇప్పుడు క్రెడిట్ కార్డు జారీ చేయడాన్ని కూడా బ్యాంకులు ఎంతో సులభతరం చేశాయి.
తక్కువ డాక్యుమెంటేషన్ తోనే క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నారు. వినియోగదారులు సైతం క్రెడిట్ కార్డు కలిగి ఉంటే 40 రోజులు వడ్డీలేని రుణాన్ని పొందవచ్చని తెలుసుకున్న తర్వాత ఎక్కువగా క్రెడిట్ కార్డులను వాడటం మొదలు పెట్టారు.
క్రెడిట్ కార్డులపై ఎక్కువ ఆఫర్లు కూడా ఉంటాయి. అయితే ఇయర్ ఎండింగ్ కావడంతో కొన్ని బ్యాంకులు అద్భుతమైన ఆఫర్లు ప్రకటించాయి.
అందులో దాదాపు రూ.25 వేల వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్స్ ని ఆన్ లైన్ షాపింగ్ చేసే కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డు వాళ్లు ఈ డిస్కౌంట్స్ ని అందిస్తున్నారు. ఆ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డు అందిస్తున్న ఈ డిస్కౌంట్ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు మాత్రమే అమలులో ఉంటాయనే విషయాన్ని గుర్తించాలి.
ప్రస్తుతం ఈ నెల చివరి వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్లని ప్రకటించారు. ఈ ఆన్ లైన్ ఆఫర్లు సోనీ, హయర్, శాంసగ్, ఎల్ జీ వంటి ప్రముఖ బ్రాండ్లపై కూడా అందుబాటులో ఉన్నాయి.
వాటిలో శాంసంగ్ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే 22.5 శాతం వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. ఇందులో మీరు మాక్సిమమ్ రూ.25 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
అదే సోనీ ప్రొడక్టులను అమెరికన్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే.. 12.5 శాతం వరకు డిస్కౌంట్స్, గరిష్టంగా రూ.22,500 వరకు క్యాష్ బ్యాక్ ను ఆఫర్లలో అందిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ ను మాత్రం జనవరి 2వ తారీఖు వరకు అందిస్తున్నారు.
హయర్ ఉత్పత్తులను అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 20 శాతం వరకు డిస్కౌంట్, రూ.12 వేల వరకు క్యాష్ బ్యాక్ కూాడ లభించనుంది.
అలాగే ఎల్ జీ ఉత్పత్తులను ఆన్ లైన్ లో అమెరికన్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. 22.5 శాతం వరకు డిస్కౌంట్, రూ.20 వేల వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నారు.
అంతేకాకుండా ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికి ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ వెసులుబాట్లు కూడా అందిస్తున్నారు.
మీరు 18 నెలల వరకు ఈఎంఐ టెన్యూర్ ను ఎంచుకోవచ్చు. అయితే ఈ ఆఫర్లు అన్నీ డిసెంబర్ 31 వరకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి.
ప్రస్తుతానికి అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డు వారు ఆఫర్లు అందిస్తున్నప్పటికీ.. మరికొన్ని బ్యాంకులు కూడా ఇలాంటి ఆఫర్లను ఆందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.