ఒకప్పుడు పుట్ట గొడుగులు వానాకాలంలో మాత్రమే లభించేవి.

నేడు పుట్టగొడుగులు  అన్ని కాలాల్లో ఎప్పుడంటే అప్పుడే లభిస్తున్నాయి.

పుట్టగొడుగుల వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే పుట్టగొడుగులు కూరగాయల కంటే ఎక్కువ ఖరీదు ఉంటాయి.

ఖరీదు ఎక్కువ ఉండటంతో పుట్టగొడుగులను తినేందుకు చాలా మంది సందేహిస్తుంటారు.

పుట్టగొడుకును తినకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతారు.

పుట్టగొడుగులలో పోషకాలు అధికంగా ఉంటాయి.

పుట్టగొడుగుల్లో మాంసాహారాన్ని మించిన పోషకాలు ఉంటాయి.

పుట్టగొడుగులను తినడం వల్ల మన శరీరానికి విటమిన్‌ డి ఎక్కువగా అందుతుంది. 

పుట్టగొడుగు రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.

పుట్టగొడుగుల్లో ఉండే రైబోఫ్లేవిన్‌  రక్తహీనత సమస్యను తొలగిస్తుంది.

పుట్టగొడగులో ఉండే నియాసిన్‌ చర్మంపై మచ్చలు, మొటిమలు తగ్గేలా చేస్తుంది.

పుట్టగొడుగుల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పుట్టగొడుగుల్లో కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. 

పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం వలన పై ప్రయోజనాలను పొందవచ్చు