జాజికాయ‌ను ఆవు నెయ్యితో అర‌గ‌దీసి దాన్ని కంటిరెప్ప‌ల‌పై రాసి నిద్రపోతే హాయిగా నిద్ర‌ప‌డుతుంది.

జాజికాయ‌ను బియ్యం క‌లిపిన నీటితో క‌లిపి తీసుకుంటే వాంతులు త‌గ్గుతాయి. 

జాజికాయ పొడిని, ప‌సుపు, నెయ్యితో సమపాళ్లలో కలిపి పెద‌వుల‌పై లేప‌నంగా పూసుకుంటే పెద‌వుల ప‌గుళ్లు త‌గ్గుతాయి.

జాజికాయ పొడిని, దోర‌గా వేయించిన చ‌లువ మిరియాల పొడితో కలిపి రోజూ పళ్లను శుభ్రం చేసుకుంటే క‌దిలే దంతాలు ధృఢంగా తయారవుతాయి.

జాజికాయ‌ను మంచి నీటితో క‌లిపి అర‌గ‌దీసి దాన్ని నుదుటిపై రాసుకుంటే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.  

వాత, క‌ఫ రోగాల‌ను న‌యం చేయ‌డంలో జాజికాయ ఎంతగానో తోడ్పడుతుంది.

నోటి పూత‌ను, ఉబ్బు రోగాన్ని, క్రిమి రోగాలను నయం చేయటంలోనూ జాజికాయ ఉపయోగపడుతుంది.

జాజికాయ‌ను పాల‌తో అర‌గ‌దీసి నోటి పూతలకు రాస్తే తగ్గుముఖం పడతాయి.

మ‌లేరియా జ్వ‌రంతో ఇబ్బంది పడుతుంటే గనుక.. ఉద‌యం ప‌ర‌గ‌డుపున 10 గ్రాముల ప‌టిక బెల్లాన్ని చ‌ప్ప‌రించి, ఆ వెంటనే 2 గ్రా. జాజికాయను కొద్ది కొద్దిగా న‌ములుతూ మింగాలి.

తర్వాత అరగంట వరకు ఏమీ తినకుండా ఉంటే మలేరియా తగ్గుముఖం పడుతుంది.

జాజికాయ చ‌ర్మం కాంతి, పురుషుల‌ల్లో వీర్య వృద్ధి, అంగ స్తంభ‌నకు తోడ్పడుతుంది.

గమనిక: ఈ చిట్కాలు పాటించే ముందు నిపుణులు లేదా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.