RRR మూవీ టీమ్ అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ జంటగా స్టెప్పులేసిన నాటు నాటు లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం.
మాములుగా బుదవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని ముందు ప్రకటించి.. గంట ముందుగానే విడదల చేశారు.
ఇంక సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్పులు చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.
కచ్చితంగా ఈ సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎంఎం కీరవాణి సంగీతం నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి.
సాంగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ వరకు కూడా చెవులు రిక్కించి వినే విధంగా ఉంది పాట.
రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఎనర్జిటిక్ సింగింగ్.. సాంగ్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు ఈ పాట చూస్తే పూనకాలు రావాల్సిందే.
సంక్రాంతి కానుకగా RRR చిత్రం జనవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.