మీరు చదివింది, విన్నది నిజమే. రీసెంట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన దానికి పోలీసులు వాళ్లని అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ న్యూస్.. సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు.

అసలు విషయానికొచ్చేస్తే.. తెలుగు హీరోల్లో చాలామందికి వీరాభిమానులు ఉన్నారు. అందులో ఎన్టీఆర్ ఒకరు.

ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ బోలెడంతమంది అభిమానులున్నారు. ఇది చాలామందికి తెలుసు.

'ఆర్ఆర్ఆర్'తో ఆలోవర్ వరల్డ్ గుర్తింపు తెచ్చుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు.

ఈ మధ్య మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మూవీకి 'దేవర' టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి మూవీ లవర్స్ మాట్లాడుకున్నారు.

కానీ కర్ణాటకలోని రాబర్సన్ పేట పరిధిలో కొందరు అభిమానులు రెచ్చిపోయి, కాస్త విపరీతంగా ప్రవర్తించారు.

అంటే తారక్ బర్త్ డేని సెలబ్రేట్ ని చేసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ మేకల్ని నరకడం రచ్చకు కారణమైంది.

మేకల్ని నరికి, వాటి రక్తంతో ఎన్టీఆర్ 'దేవర' పోస్టర్ కు పలువురు అభిషేకం చేసినట్లు కన్నడ మీడియాలో కథనాలొచ్చాయి.

కేక్ కట్ చేయడం, రెండు మేకల్ని నరకడంతోపాటు వాటి రక్తాన్ని అక్కడ విసిరి నానా హంగామా చేశారు.

దీంతో పోలీసులు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు తొమ్మిది మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.

ఇది చూసిన నెటిజన్స్ తలో రకంగా స్పందిస్తున్నారు. అభిమానం హద్దులు దాటేలా వాళ్లు ప్రవర్తించాలని మాట్లాడుకుంటున్నారు.

అభిమానం ఎంతున్నాసరే దాన్ని కంట్రోల్ లో ఉంచితే అందరికీ మంచిదని కూడా నెటిజన్స్ అనుకుంటున్నారు.

మరి ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పోస్టర్ కి రక్తాభిషేకం చేయడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.